
Stuart Binny Catch Video: క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంటాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 ఆరంభ మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ చేసిన క్యాచ్ దీనికి మంచి ఉదాహరణగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మధ్య జరిగిన పోరులో చివరి వికెట్ కోసం బిన్నీ అద్భుతంగా స్పందించాడు. పియూష్ చావ్లా వేసిన బంతిని ఫవాద్ అహ్మద్ లెగ్ సైడ్‌లోకి ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్‌కు సరైన ఎలివేషన్ రాకపోవడంతో బంతి మిడ్ వికెట్ వైపు తక్కువ ఎత్తులో దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బిన్నీ క్షణాల్లో ఎడమవైపు డైవ్ చేసి బంతి నేలను తాకకముందే పట్టేశాడు.
ఈ క్యాచ్‌తో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 17వ ఓవర్‌లో ఫవాద్ వికెట్ పడటంతో ఆస్ట్రేలియా 150 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత్ ఛాంపియన్స్ 46 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?
అంతకుముందు భారత్ ఛాంపియన్స్ బ్యాటింగ్‌లో 196 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 44 బంతుల్లో 71 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యూసుఫ్ పఠాన్, రిషి ధావన్ కూడా కీలక పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తరఫున డి ఆర్సీ షార్ట్ 65, జో బర్న్స్ 45 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో ఎక్కువ మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
Stuart Binny pulls off a STELLAR catch to seal India Champions’ victory 😎
Catch all the action from the World Championship of Legends LIVE on FanCode 📲
#WCL https://t.co/Pcgo0H9lmc
— FanCode (@FanCode) October 3, 2026
ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయే సమయానికి 16 ఓవర్లలో 150 పరుగులు చేసింది. మరో వికెట్ పడితే భారత్ విజయం ఖాయమయ్యే పరిస్థితిలో చావ్లా బంతిని అందుకున్నాడు. ఫవాద్ భారీ షాట్‌కు ప్రయత్నించగా బిన్నీ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. మ్యాచ్‌ను ముగించిన ఆ క్యాచ్ ప్రత్యేకంగా నిలిచింది.
బిన్నీకి WCLలో ఇది కొత్త విషయం కాదు. 2025 సీజన్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో 122 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 167.12గా ఉంది. ఒక అర్ధశతకం సాధించడంతో పాటు తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్ ఛాంపియన్స్‌పై కేవలం 13 బంతుల్లో 35 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..