ఐసీసీ ప్రపంచకప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. భారత్ నిర్దేశించిన 268 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ 125 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ ముందు కరీబియన్లు నిలవలేకపోయారు. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ చేసిన 31 పరుగులే అత్యధికం. నికోలస్ పూరన్ 28, హెట్‌మెయిర్ 18 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ డబుల్ డిజిట్ దాటలేదు. ఈ విజయంతో భారత్ దాదాపు సెమీస్‌కు చేరుకోగా, విండీస్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
Brilliant performance by #TeamIndia as they defeat West Indies by 125 runs ???????? #WIvIND #CWC19 pic.twitter.com/OLcyhpymzV
— BCCI (@BCCI) June 27, 2019