దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో మురిపించింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ అనేదే లేకుండా చేతులెత్తేశారు.
ఇక క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్లుగా ప్రస్థుత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నుంచి అమీర్ సోహైల్, వాసిం అక్రమ్, వకార్ యూనస్, షాహిద్ ఆఫ్రిది, మిస్బా ఉల్ హక్, సర్పరాజ్ అహ్మద్ ల దాకా ఎవరున్నా ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భారతజట్టు చేతిలో పరాజయమే ఎదురైంది. 1992 నుంచి నేటి వరకు ఏడుసార్లు టీమిండియా పాక్ జట్టుపై విజయ దుందుభి మోగించి భారత క్రికెట్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. మొదటి మూడు వరల్డ్ కప్ పోటీల్లో సచిన్ టెండూల్కర్ పాక్ జట్టుపై అత్యధిక పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
Results of India v Pakistan in Men's World Cups:
1992: ??
1996: ??
1999: ??
2003: ??
2011: ??
2015: ??
2019: ?? pic.twitter.com/BIOxOMZfM6— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019