IND A vs NEP: హ్యాండిచ్చిన అభిషేక్, వైభవ్.. భారమంతా తెలుగోడిపైనే..!

India A vs Nepal, 4th Match, Group B, ACC Men's Asia Cup Rising Stars 2026: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు 25.2 ఓవర్లకు 101 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. కుమార్ కుశాగ్ర మరియు తిలక్ వర్మ క్రీజులో కొనసాగుతుండగా, వైభవ్ సూర్యవంశీ 26 పరుగులతో ఆరంభంలో సహకరించాడు. నేపాల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఈ పోటీలో భారత ఏ బ్యాటింగ్ లక్ష్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.

IND A vs NEP: హ్యాండిచ్చిన అభిషేక్, వైభవ్.. భారమంతా తెలుగోడిపైనే..!
India A Vs Nepal, 4th Match

Updated on: Nov 20, 2026 | 5:34 PM

India A vs Nepal, 4th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: నేపాల్‌తో జరుగుతున్న పోరులో ఇండియా ఏ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 25.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఔట్..

భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతడిని సర్రాఫ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు పంపించాడు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 9 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆయుష్ బదోని 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి రాజ్‌బన్షీ బౌలింగ్‌లో డుమ్రే చేతికి చిక్కాడు.

ఎక్కువమంది చదివినది: రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులో ఛాన్స్.. ఎవరంటే?

క్రీజులో తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర..

ప్రస్తుతం భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర ముందుకు తీసుకెళ్తున్నారు. తిలక్ వర్మ 59 బంతుల్లో 30 పరుగులు చేయగా,
కుమార్ కుశాగ్ర 41 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో నిలిచారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తానోళ్లు ఎప్పటికీ మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!

భారత్ ఏ ఎంత స్కోర్ సాధింస్తుందో చూడాలి. తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us