IND vs ZIM, 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. టీమిండియా ప్లేయింగ్ 11లో 3 మార్పులు.. ఎవరొచ్చారంటే?

India vs Zimbabwe, 3rd T20I: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే భారత జట్టులోకి తిరిగి వచ్చారు. అదే సమయంలో జింబాబ్వే జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.

IND vs ZIM, 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. టీమిండియా ప్లేయింగ్ 11లో 3 మార్పులు.. ఎవరొచ్చారంటే?
Ind Vs Zim 3rd T20i Toss

Updated on: Jul 10, 2024 | 4:40 PM

India vs Zimbabwe, 3rd T20I: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే భారత జట్టులోకి తిరిగి వచ్చారు. అదే సమయంలో జింబాబ్వే జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆ తర్వాత జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..