IND vs ZIM 1st T20I: తొలి టీ20ఐ ఆడనున్న ఐపీఎల్ పెను సంచలనం.. జైస్వాల్‌కు చెక్ పడినట్లే?

|

Jul 05, 2024 | 12:05 PM

Abhishek Sharma vs Yashasvi Jaiswal: భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ టూర్‌కి యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారు. ఈ పర్యటనకు అభిషేక్ శర్మకు కూడా అవకాశం లభించింది. అతను మొదటి మ్యాచ్‌లోనే ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా జట్టులో భాగమే. అయితే అతను మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత జింబాబ్వే చేరుకుంటాడు.

IND vs ZIM 1st T20I: తొలి టీ20ఐ ఆడనున్న ఐపీఎల్ పెను సంచలనం.. జైస్వాల్‌కు చెక్ పడినట్లే?
Abhishek Sharma Vs Yashasvi
Follow us on

Abhishek Sharma vs Yashasvi Jaiswal: భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ టూర్‌కి యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారు. ఈ పర్యటనకు అభిషేక్ శర్మకు కూడా అవకాశం లభించింది. అతను మొదటి మ్యాచ్‌లోనే ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా జట్టులో భాగమే. అయితే అతను మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత జింబాబ్వే చేరుకుంటాడు. దీంతో ఈ ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్‌కు లక్కీ ఛాన్స్ దొరికిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో బాగా రాణిస్తే.. జైస్వాల్ ప్లేస్‌లో తన పేరును బలంగా ప్రకటించుకోవచ్చు.

అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్స్. ఇద్దరూ చాలా ఎటాకింగ్ క్రికెట్ ఆడటానికి ప్రసిద్ధి చెందారు. యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరుపున చాలా మ్యాచ్‌లు ఆడాడు. అతను టెస్ట్ మ్యాచ్‌లలో కూడా జట్టు కోసం తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అభిషేక్ శర్మకు ఇది మొదటి అవకాశం. అయితే ఈసారి జింబాబ్వే టూర్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా టీమిండియా రేసులో ఉన్న యశస్వి జైస్వాల్‌ను అధిగమించేందుకు అభిషేక్‌కు మంచి అవకాశం ఉంది.

యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ గణాంకాలు..

యశస్వి జైస్వాల్ భారత్ తరపున ఇప్పటివరకు 9 టెస్టులు, 17 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, అతను టెస్ట్ మ్యాచ్‌లలో 1028 పరుగులు, T20 ఇంటర్నేషనల్స్‌లో 502 పరుగులు చేశాడు. టీ20లో అతని స్ట్రైక్ రేట్ 161.93గా ఉంది. మనం అభిషేక్ శర్మ గణాంకాల గురించి మాట్లాడితే, అతను ఇంకా భారతదేశం తరపున ఆడలేదు. కానీ, ఖచ్చితంగా T20 మ్యాచ్‌లలో తన సత్తాను చూపించాడు. అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 104 టీ20 మ్యాచ్‌లు ఆడి 2671 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 153, అతను ఈ ఫార్మాట్‌లో 3 సెంచరీలు కూడా చేశాడు.

జింబాబ్వేతో జరిగే మొదటి రెండు మ్యాచ్‌లలో అభిషేక్ శర్మకు అవకాశం రావడం ఖాయమని, ఈ రెండు మ్యాచ్‌లు, సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో అతను మెరుగ్గా రాణిస్తే, భవిష్యత్ మ్యాచ్‌లకు అతని అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ మెరుగైన ఆటతీరును కొనసాగిస్తే తదుపరి సిరీస్‌లో కచ్చితంగా అవకాశం దక్కించుకోవడంతోపాటు టీ20లోనైనా యశస్వి జైస్వాల్‌కు సవాల్‌గా మారవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..