టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు అందుకున్నాడు. క్వీన్స్‌పార్క్ ఓవల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ కొట్టాడు. తద్వారా 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఇక టెస్టుల్లో 29వ సెంచరీ నమోదు చేసి ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 76వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ లిస్టులో కోహ్లీ కంటే కేవలం సచిన్ మాత్రమే ముందున్నాడు. కాగా 500 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టడంతో కోహ్లీతో పాటు అతని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే పశ్చిమబెంగాల్‌కు చెందిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఈ రికార్డును వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రోడ్డుపై ఉండే వారికి, పేద వారికి అన్నదానం చేసి తమ అభిమానాన్ని, తమ గొప్ప మనసును చాటుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో కింగ్ కోహ్లీ పేరు మీద విరాట్ కోహ్లీహెల్ప్ ఫౌండేషన్ నడుస్తోంది. కోహ్లీ అభిమానులు దీనిని నిర్వహిస్తున్నారు.
గతంలోనూ వీరు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో విరాట్ 75వ సెంచరీ నమోదు చేసినప్పుడు కూడా ఇలాగే పేదవారికి ఫుడ్ ప్యాకెట్స్ పంచిపెట్టారు. ఇప్పుడు కూడా చాలామంది పేదలకు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసి తమ మంచి మనసును చాటుకున్నారు. కోహ్లీ అభిమానుల అన్నదానానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కోహ్లీ ఫ్యాన్స్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 289 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత బౌలర్ల జోరు చూస్తుంటే విండీస్ ఈ టార్గెట్‌ను ఛేదించడం అంత సులభమేమీ కాదు.
Virat Kohli fans distributed food to needy people in their idol’s 500th match.
Nice gesture from Kohli fans. pic.twitter.com/vGmcdG87AX
— Johns. (@CricCrazyJohns) July 22, 2023
Virat Kohli fans from West Bengal donated food packets on the occasion of Kohli’s 28th Test century. pic.twitter.com/BlhZX3dGq4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..