IND vs SL, 1st T20, Highlights: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు గొప్పగా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను కూడా విజయవంతమైన ఆరంభం చేసింది. ఫిబ్రవరి 24, గురువారం లక్నోలో శ్రీలంకతో జరిగిన మొదటి T20Iలో భారత్ 62 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇషాన్ కిషన్(89), శ్రేయాస్ అయ్యర్(57 నాటౌట్)ల అర్థ సెంచరీలతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రోహిత్ 44 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లంక బౌలర్లలో కుమరా, షనక చెరో వికెట్ పడగొట్టారు.
మూడు T20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతుంది. వెస్టిండీస్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తరువాత, టీమిండియా అదే ఉద్దేశ్యంతో ఈ సిరీస్ బరిలో నిలిచింది. టీ20 ప్రపంచకప్ ముందు, ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అవకాశం లేని కొంతమంది ఆటగాళ్లపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దింపనున్నాడు. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో రోహిత్‌తో పాటు బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పంత్‌కు విశ్రాంతి ఇవ్వగా రాహుల్ గాయపడడంతో ఈ సిరీస్ నుంచి దూరమయ్యారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్(కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు గొప్పగా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను కూడా విజయవంతమైన ఆరంభం చేసింది. ఫిబ్రవరి 24, గురువారం లక్నోలో శ్రీలంకతో జరిగిన మొదటి T20Iలో భారత్ 62 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
వరుసగా వికెట్లు కోల్పోతూ శ్రీలంక టీం పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయింది. చాహల్ ఓవర్లో షనక(3) పెవిలియన్ చేరాడు. దీంతో 11 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.
10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక టీం 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. లంక విజయం సాధించాలంటే 60 బంతుల్లో 143 పరుగులు చేయాల్సి ఉంది.
భువనేశ్వర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కమిల్ మిషార రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 3 ఓవర్లకు 15 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది.
భువనేశ్వర్ వేసిన తొలి బంతికే నిస్సాంక ఆశ్చర్యకరంగా పెవిలియన్ చేరాడు. బాల్ నిస్సాంక బ్యాట్‌కు తగిలి ఆ వెంటనే కిందనుంచి వెళ్లి వికెట్లను తాకింది. ఒక ఓవర్ పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 6 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్(89), శ్రేయాస్ అయ్యర్(57 నాటౌట్)ల అర్థ సెంచరీలతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రోహిత్ 44 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లంక బౌలర్లలో కుమరా, షనక చెరో వికెట్ పడగొట్టారు.
ఇషాన్ కిషన్ బౌటయ్యాక ఊపిరి పీల్చుకున్న లంక బౌలర్లను శ్రేయాస్ గడగడలాడించాడు. కేవలం 25 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
భారత బ్యాట్స్‌మెన్స్ దూకుడైన ఆటతో లంక బౌలర్ల వ్యూహాలు ఫలించడం లేదు. వికెట్లు పడుతున్నా.. మరోవైపు భారత బ్యాట్స్‌మెన్స్ బౌండరీ వేట మాత్రం ఆపడం లేదు. దీంతో 19 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్(89 పరుగులు, 56 బంతులు, 10 ఫోర్లు, 3 సిక్సులు) 17వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 155 పరుగుల వద్ద టీమిండియా తన రెండో వికెట్ కోల్పోయింది.
టీమిండియా సారథి రోహిత్ శర్మ(44 పరుగులు, 32 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) కుమార బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 111 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఓపెనర్ల దూకుడైన ఆటతో టీమిండియా స్కోర్ 100 పరుగులు దాటింది. ఇషాన్ కిషన్ 59, రోహిల్ 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
దూకుడుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 30 బంతుల్లో టీ20ల్లో తన రెండో అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
టీమిండియా ఓపెనర్ల ధాటికి 5.3 ఓవర్లలోనే స్కోర్ 50 పరుగులు దాటింది. రోహిత్ 17, ఇషాన్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు బౌండరీలతో లంక బౌలర్లపై సత్తా చాటుతున్నారు. ఇషాన్ కిషన్ 3వ ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 26 పరుగులు చేసింది. రోహిత్ 11, ఇషాన్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
ఈరోజు జట్టులో ఆరు మార్పులు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గాయం కారణంగా రితురాజ్ గైక్వాడ్ ఈరోజు ఆడడం లేదు.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్(కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార
భారత్-శ్రీలంక మధ్య మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 14 విజయాలు సాధించగా, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు లక్నోలో తొలి టీ20 జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక టీం తొలుత బౌలింగ్ చేయనుంది. దీంతో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయనుంది.