Ind Vs Sl: మొదటి టీ20 మ్యాచ్‌లో ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌.. మీమ్స్ తో రెచ్చిపోయిన నెటిజన్లు..

| Edited By: Anil kumar poka

Feb 25, 2022 | 10:03 AM

లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా (Indian Cricket Team)  62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Ind Vs Sl: మొదటి టీ20 మ్యాచ్‌లో ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌.. మీమ్స్ తో రెచ్చిపోయిన నెటిజన్లు..
Ishan Kishan
Follow us on

లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా (Indian Cricket Team)  62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ ఇషాన్ కిషన్ (Ishan Kishan) అదరగొట్టాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌ 89 పరుగులు చేసి జట్టు భారీస్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్‌ సహచరులతోనూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 44 పరుగులు) తో మొదటి వికెట్‌కు 111 జోడించిన అతను.. శ్రేయస్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 57 పరుగులు) రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. ఇషాన్‌ ధనాధాన్‌ బ్యాటింగ్‌ తో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది టీమిండియా.

ఐపీఎల్ లో రూ. 15 కోట్లు పెట్టి మరీ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.  అయితే శ్రీలంకతో సిరీస్‌ కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఇషాన్‌ తేలిపోయాడు. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్‌లు ఆడిన కిషన్‌ కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఓపెనర్‌గా మరో ఆటగాడిని పంపాలని కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు. అయితే గోడకు కొట్టిన బంతిలా వేగంగా ఫామ్‌లోకి వచ్చాడు ఇషాన్‌. మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌పై నెటిజన్లు తమదైన మీమ్స్‌తో రెచ్చిపోయారు. కొందరైతే అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోని తగ్గేదేలే పోస్టర్‌ను కిషన్‌ ఫొటోతో మార్ఫింగ్‌ చేశారు. మరి ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌పై నెట్టింట్లో వైరలవుతోన్న మీమ్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.