IND vs SL, Mohammed Siraj: ఒకే ఓవర్లో 4 వికెట్లు.. మలింగా రికార్డ్‌ను బ్రేక్ చేసిన హైదరాబాదీ పేసర్..

సిరాజ్ కొత్త బాల్ ఫైరింగ్ బంతులతో శ్రీలంక టీంను వణికిస్తున్నాడు. టాస్ గెలిచిన లంక నిర్ణయం తప్పని నిరూపించాడు. ఈక్రమంలో లంక టాప్ ఆర్డర్‌ను ముక్కలు చేశాడు. సిరాజ్ మొదట పాతుమ్ నిస్సాంకాను పెవిలియన్ చేర్చి, ఆతర్వాత చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా వికెట్లను పడగొట్టడంతో శ్రీలంక నాలుగు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.

IND vs SL, Mohammed Siraj: ఒకే ఓవర్లో 4 వికెట్లు.. మలింగా రికార్డ్‌ను బ్రేక్ చేసిన హైదరాబాదీ పేసర్..
Ind Vs Sl Final Siraj

Updated on: Sep 17, 2023 | 4:33 PM

ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఐదు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

సిరాజ్ కొత్త బాల్ ఫైరింగ్ బంతులతో శ్రీలంక టీంను వణికిస్తున్నాడు. టాస్ గెలిచిన లంక నిర్ణయం తప్పని నిరూపించాడు. ఈక్రమంలో లంక టాప్ ఆర్డర్‌ను ముక్కలు చేశాడు. సిరాజ్ మొదట పాతుమ్ నిస్సాంకాను పెవిలియన్ చేర్చి, ఆతర్వాత చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా వికెట్లను పడగొట్టడంతో శ్రీలంక నాలుగు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

సిరాజ్ వికెట్ల ఊచకోత ఓవర్ నిస్సాంక వికెట్‌తో ప్రారంభమైంది. అతను లెంగ్త్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. రవీంద్ర జడేజా తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టాడు. ఫామ్‌లో ఉన్న సమరవిక్రమను కేవలం రెండు బంతుల్లోనే పెవిలియన్ చేర్చాడు. అంతకు ముందు చరిత్ అసలంక తన మొదటి బంతిని కవర్ వద్ద ఇషాన్ కిషన్‌కి పంపాడు. డిసిల్వా హ్యాట్రిక్ బంతిని లాంగ్ ఆన్ ద్వారా ఫోర్‌తో తప్పించగా, సిరాజ్ పదునైన డెలివరీతో క్యాచ్-ఇచ్చేలా ప్రేరేపించాడు.

సిరాజ్ తన అద్భుతమైన స్పెల్‌ను కొనసాగించాడు. కేవలం 15 బంతుల్లో ఐదు వికెట్లు సాధించాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను తన మూడో ఓవర్‌లో నాలుగు బంతుల్లో డకౌట్ చేశాడు.

చమిందా వాస్‌‌ను సమం చేసిన సిరాజ్..

29 ఏళ్ల ఈ హైదరాబాదే పేసర్.. కేవలం 16 బంతుల్లోనే ఈ ఫీట్‌ను చేరుకుని, వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డులో చేరాడు. ఈ క్రమంలో వన్డేలో శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్‌ను సమం చేశాడు. 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ ఈ మైలురాయిని సాధించాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..