IND vs SL 3rd ODI: టీమిండియా టార్గెట్ 249.. అరంగేట్రంలో అదరగొట్టిన రియాన్ పరాగ్..

|

Aug 07, 2024 | 6:11 PM

కొలంబో వేదికగా నేడు భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్‌కు 249 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అవిష్క ఫెర్నాండో 96 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు కుసాల్ మెండిస్ 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, పాతుమ్ నిస్సంక 45 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు.

IND vs SL 3rd ODI: టీమిండియా టార్గెట్ 249.. అరంగేట్రంలో అదరగొట్టిన రియాన్ పరాగ్..
Ind Vs Sl 3rd Odi Score
Follow us on

కొలంబో వేదికగా నేడు భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్‌కు 249 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అవిష్క ఫెర్నాండో 96 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు కుసాల్ మెండిస్ 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, పాతుమ్ నిస్సంక 45 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు.

శ్రీలంక ఆటగాళ్లు తొలి, రెండో వికెట్లకు అర్ధసెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. రెండో వికెట్‌కు కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ తరపున అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్, వాషింగ్టన్, కుల్దీప్, సిరాజ్ తలో వికెట్ తీశారు.

తొలి వన్డే టై కాగా, రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈరోజు శ్రీలంక గెలిస్తే 27 ఏళ్ల తర్వాత భారత్‌ను వన్డే సిరీస్‌లో ఓడించినట్లవుతుంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

శ్రీలంక : చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, జెనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే.

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..