IND vs SL: సూర్యకుమార్ కంటే బెటర్.. వన్డేల్లో అద్భుత ఆటగాడు.. అయినా, ప్లేయింగ్ XIలో నో ఛాన్స్.. కారణం ఇదే..

ODI World cup 2023: వన్డే ప్రపంచకప్ సన్నాహాల కోసం టీమ్ ఇండియా తన అత్యుత్తమ ప్లేయింగ్ XIని రంగంలోకి దింపుతుంది. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ XIలో ఏ ఆటగాళ్లు ఆడతారు అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నగా మారింది.

IND vs SL: సూర్యకుమార్ కంటే బెటర్.. వన్డేల్లో అద్భుత ఆటగాడు.. అయినా, ప్లేయింగ్ XIలో నో ఛాన్స్.. కారణం ఇదే..
suryakumar yadav shreyas iyer
Follow us

|

Updated on: Jan 10, 2023 | 12:50 PM

శ్రీలంకతో వన్డే సిరీస్‌తో ప్రపంచకప్‌కు టీమిండియా సన్నాహాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ ఏడాది మొదటి సిరీస్ గౌహతి వన్డేతో ప్రారంభమవుతుంది. వన్డే ప్రపంచకప్ సన్నాహాల కోసం టీమ్ ఇండియా తన అత్యుత్తమ ప్లేయింగ్ XIని రంగంలోకి దింపుతుంది. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ XIలో ఏ ఆటగాళ్లు ఆడతారు అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నగా మారింది. గౌహతి వన్డేలోనే ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి ఎన్నో చిక్కుముడులు మరికొద్ది సేపట్లో వీడనున్నాయి. ప్లేయింగ్ XI లో ఎంట్రీ కోసం సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ మధ్య హోరాహోరీ పోరు ఉంది.

సూర్యకుమార్ యాదవ్ పేరు ప్రచారంలో ఉంది. ఈ ఆటగాడు టీ20 ఫార్మాట్‌లో అద్భుతాలు చేశాడు. శ్రీలంకతో జరిగిన రాజ్‌కోట్ టీ20లో సూర్య అద్భుత సెంచరీతో సిరీస్‌ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కూడా ఇప్పటి వరకు స్ట్రాంగ్ గేమ్ కనబరిచాడు. అయితే, అయ్యర్, సూర్యకుమార్ మధ్య ఎవరు ఆడతారనే ప్రశ్నగా నిలిచింది.

సూర్యకుమార్-అయ్యర్ మధ్య గొడవ?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడంతో సూర్యకుమార్, అయ్యర్ మధ్య వివాదం నెలకొంది. ముగ్గురూ తప్పకుండా ఆడతారు. శుభమన్ గిల్‌కు కూడా అవకాశం ఇవ్వడంపై రోహిత్ శర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో టాప్ 4 బ్యాట్స్‌మెన్స్ సెట్ అయ్యారు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌ కోసం అయ్యర్‌, సూర్యకుమార్‌ల మధ్య పోరు నెలకొంది. సమస్య ఏమిటంటే, ఆటగాళ్లిద్దరూ ఫాంలోనే ఉన్నారు. అయితే తొలి వన్డేలో ఎవరు బెంచ్ మీద కూర్చుంటారో, వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ సత్తా..

గత ఏడాది వన్డే ఫార్మాట్‌లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతాలు చేశాడు. ఈ ఆటగాడు 15 మ్యాచ్‌ల్లో 55.69 సగటుతో 724 పరుగులు చేశాడు. అయ్యర్ బ్యాట్ నుంచి ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు వచ్చాయి. అయ్యర్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అతడిని ప్లేయింగ్ XI నుంచి తప్పించడం తప్పని స్పష్టం కావొచ్చు.

మరోవైపు వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఆటగాడు 2022 సంవత్సరంలో 26 సగటుతో 260 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. మరి ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికి ఛాన్స్ ఇస్తాడన్నదే ప్రశ్నగా మారింది.

ఆల్ రౌండర్లతో నిండిన టీమిండియా..

సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య పోరుకు టీమ్ ఇండియాలో ఆల్ రౌండర్లు అధికంగా ఉండటమే ఒక కారణంగా నిలిచింది. జట్టులో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఈ ముగ్గురినే ఆడించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశం ఇవ్వవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..