టీమిండియాకు మరో ధోని దొరికేసినట్లుగా అనిపిస్తోంది. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే చూసినవారంతా చెప్పే మాట ఇది. ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సంజూ శాంసన్. చివరి వరకు మ్యాచ్‌ను అతడు తీసుకొచ్చిన తీరు.. లాస్ట్ ఓవర్‌లో దంచికొట్టుడు చూస్తే.. మరోసారి ధోనిని గుర్తు చేశాడని కొందరి ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే ఇక్కడొక విషయం.. శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో చివరి వరకు మ్యాచ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించగా.. టీమిండియా 9 పరుగుల తేడాతో మొదటి వన్డేలో ఓటమిపాలైంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నో వేదికగా సఫారీలతో జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. 40 ఓవర్ల మ్యాచ్‌లో 250 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియాకి ఆదిలోనే సఫారీలు కళ్లెం వేశారు. 8 పరుగులకే భారత ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో వికెట్ కీపర్ సంజూ శాంసన్(86) టీం భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. అతడికి శ్రేయాస్ అయ్యర్(50) తోడవ్వడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే అర్ధ సెంచరీ చేశాక అయ్యర్ ఔట్ కావడంతో.. ఆ తర్వాత్ రెగ్యులర్ ఇంటెర్వల్స్‌లో భారత్ వికెట్లు కోల్పోవడంతో.. విజయానికి చివరి ఓవర్‌లో టీమిండియా 30 పరుగులు చేయాల్సి ఉంది. ఇక అప్పుడే శాంసన్.. తన పవర్ హిట్టింగ్ చూపించాడు. 6,4,4,0,4,1 బౌండరీలతో చెలరేగిపోయాడు.
కాని చివరికి టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. డికాక్(48), క్లాసన్(74), మిల్లర్(75) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేరుకోగలిగింది.
వికెట్ కీపర్ సంజూ శాంసన్.. తన వీరోచిత బ్యాటింగ్‌లో ధోనిని తలపించాడు. విజయానికి 30 బంతుల్లో 73 పరుగులు కావాల్సి ఉండగా.. శాంసన్ అచ్చం ధోని మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. కామ్‌గా చక్కనైన ఆటతీరును కనబరుస్తూ.. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లాడు. ఇక చివరి ఓవర్‌లో 30 పరుగులు కావాల్సి ఉండగా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కాని చివర్లో టీమిండియా మ్యాచ్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితేనేం శాంసన్ ఇన్నింగ్స్‌కు మాత్రం మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..