India vs South Africa, 37th Match Playing XI: ప్రపంచ కప్ 2023లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని చారిత్రక మైదానం ‘ఈడెన్ గార్డెన్స్’లో ఇరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక్కడ టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పు లేదు. అయితే దక్షిణాఫ్రికా జట్టు అదనపు స్పిన్నర్‌తో రంగంలోకి దిగింది.
టాస్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘ఇది మెరుగైన పిచ్. నాకు ఈ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడడం ఇష్టం. భారత జట్టు మొత్తం ఈ చారిత్రక మైదానంలో ఆడేందుకు ఇష్టపడుతోంది. మా ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయలేదు.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..