India vs South Africa 1st Test Highlights: సెంచూరియన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ చివరి రోజున సఫారీలు కేవలం 191 పరుగులు మాత్రమే చేసింది. చివరి రోజు మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో సఫారీలు కుప్పకూలారు. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ బాట పట్టారు. మొదటి సెషన్ ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా టీమ్.. ఆ తరువాత మిగిలిన వికెట్లు కోల్పోయి ఆలవుట్ అయ్యింది. దాంతో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకు ముందు తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజున.. రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. 94/4 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆచితూచి ఆడారు. ఇదిలా ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా టార్గెట్ 305 పరుగులుగా నిర్ధారణ అయింది.
ఇక లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మార్కరమ్(1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పీటర్సన్(17), డుస్సెన్(11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కానీ ఒకవైపు నుంచి దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(77) స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా స్కోర్ సెంచరీ దాటింది. మొదటిసెషన్ ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టంతో 180 పరుగులు చేసిన సఫారీలు.. ఆ తరువాత వెను వెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. 10 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో టీమిండియా 113 పరుగుల తేడాతో తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించింది.
జట్ల స్కోర్:
ఇండియా 327 & 174
సౌతాఫ్రికా: 197 & 191
భారత్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటీశ్వర్ పుజారా, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), మార్కరమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ముల్దర్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఎనిగిడి
IND vs SA Live Score: సెంచూరియన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ చివరి రోజున సఫారీలు కేవలం 191 పరుగులు మాత్రమే చేసింది. చివరి రోజు మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో సఫారీలు కుప్పకూలారు. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ బాట పట్టారు. మొదటి సెషన్ ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా టీమ్.. ఆ తరువాత మిగిలిన వికెట్లు కోల్పోయి ఆలవుట్ అయ్యింది. దాంతో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs SA Live Score: ఇండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తొమ్మిదో వికెట్‌గా రబడా – 0 (4 బంతులు); జట్టు స్కోరు -190/9
IND vs SA Live Score: ఇండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఎనిమిదో వికెట్‌గా మార్కో యాన్సన్ పెవిలియన్ బాట పట్టాడు. యాన్సన్ – 13 (14 బంతులు, 3×4); జట్టు స్కోరు -190/8
చివరి రోజు మ్యాచ్‌లో మొదటి సెషన్ ముగిసింది. చివరి రోజు మూడు వికెట్లు పడగొట్టిన టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఈ సెషన్‌లో దక్షిణాఫ్రికా కూడా వేగంగా పరుగులు చేయడంతో ఆరంభంలో భారత్‌కు కాస్త ఇబ్బందిగా మారింది. లంచ్ తర్వాత టెంబా, బావుమా, మార్కో జాన్సన్ ఇన్నింగ్స్‌లో లీడ్ రోల్ పోషించారు. మొదటి సెషన్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 182/7. ప్రస్తుతం క్రీజులో జాన్సన్, బావుమా ఉన్నారు.
IND vs SA Live Score: సౌతాఫ్రికా జట్టు ఇప్పటికి 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న బావుమా, యాన్సన్ జట్టు స్కోరును పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుత సౌతాఫ్రికా స్కోర్ 182/7.
IND vs SA Live Score: ఏడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. షమి బౌలింగ్‌లో వియాన్ ముల్డర్ అవుట్. మల్డర్-1 (3 బంతులు); సౌతాఫ్రికా స్కోర్- 164/7
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో డి కాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్ కట్ షాట్‌కు ట్రై చేసిన డి కాక్.. వికెట్‌ను సమర్పించుకున్నాడు. డికాక్ 28 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
305 పరుగుల టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 150 పరుగుల స్కోర్ అందుకుంది. ఐదు వికెట్లు కోల్పోగా.. సఫారీలకు విజయం దక్కాలంటే ఇంకో 155 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డికాక్(13), బవుమా(17) క్రీజులో ఉన్నారు. 56 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(77) భారీ షాట్ ఆడబోయి వికెట్ల ముందు బుమ్రాకు దొరికిపోయాడు. దీనితో సఫారీలు ఐదో వికెట్ కోల్పోయారు.
ఐదో రోజు ఆటను దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. మరో వికెట్ పడకుండా బవుమా(11), ఎల్గర్(72) చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తూ.. చెత్త షాట్స్ ఆడకుండా జాగ్రత్తగా ఆచితూచి గేమ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.