India vs South Africa, 2nd Test: జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు దక్షిణాఫ్రికా బలమైన పునరాగమనం చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆటను కనబరిచింది. అయితే, టీమ్ ఇండియాకు ఇంకా అవకాశం ఉంది. దీని కోసం, నాల్గవ రోజు ప్రారంభంలో త్వరగా వికెట్లు పడగొడితే విజాయకాశాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎల్గర్ వికెట్ కీలకం కానుంది.
వికెట్లు పడితే దక్షిణాఫ్రికాపై ఒత్తిడి..
త్వరగా వికెట్ పడగొడితేనే సౌతాఫ్రికా ఒత్తిడికి లోనవుతుంది. ఎల్గర్ వికెట్‌ను ఎంత త్వరగా పడగొడితే అంత మంచింది. అతడితో పాటు టెంబా బౌమా వికెట్ కూడా చాలా కీలకం కానుంది. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌లో పెద్దగా డెప్త్ లేదు. కాబట్టి తొలి అరగంటలో ఎల్గర్, బౌమా వికెట్లు పడితే టీమిండియాకు విజయానికి అడ్డు ఉండదు.
రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యం..
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔట్ అయినందుకు ఏమాత్రం అతని చెత్త షాట్ ఎంపికే. కీలక దశలో పంత్ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించాడు. ఇలాంటి టైంలో అలాంటి షాట్లు ఆడాల్సిన అవసరం లేదు. పంత్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది. సౌతాఫ్రికా ఫీల్డర్లు రెచ్చగొట్టినంత మాత్రానా పంత్ ఇలా చేయడం పద్థతి కాదు. ఇది కేవలం టెస్ట్ క్రికెట్ అని గుర్తుంచుకుని పోరాడాల్సింది. దీంతో ప్రస్తుతం భారత్ విజయం కోసం బౌలర్లపై భారత వేయాల్సన పరిస్థితి ఎదురైంది.
పుజారా, రహానే తిరిగి ఫామ్‌లోకి..
భారత రెండో ఇన్నింగ్స్‌లో ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె అర్ధ సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. వారిద్దరూ ఫామ్‌కి తిరిగి ఫాంలోకి రావడం టీమిండియాకు సంతోషం కలిగించే వార్తనే. అయితే వీరి భాగస్వామ్యం ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండేది. భారత జట్టు భారీ స్కోర్ చేసేది. మరి నేటి మ్యాచులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో చూడాలి.
Also Read: ICC Women World Cup 2022: ఐసీసీ వరల్డ్ కప్ 2022 భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?