India Vs South Africa 3rd ODI: పార్ల్‌లో జరిగిన రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా విజయం కోసం కేప్ టౌన్ చేరుకుంది. అంటే ప్రస్తుత టూర్‌లో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన స్టేడియానికి చేరుకుంది. ఈరోజు రాహుల్ సేన ఓడిపోతే వన్డే సిరీస్ కూడా క్లీన్‌స్వీప్ అవ్వనుంది. ఇది జరగకుండా ఉండాలంటే టీమిండియా నేడు తప్పక గెలవాల్సిందే. ఎలాగైన ఈ మ్యాచ్‌లో గెలిచి కొత్త ఏడాదిలో ఈ ఫార్మాట్‌లో గెలుపొందాలని కోరుకుంటోంది. తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు వరుస విజయాలతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ వన్డేలోనూ గెలిచి హ్యాట్రిక్ విజయంతో వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని సౌతాఫ్రికా కోరుకుంటోంది.
కేప్ టౌన్ రిపోర్ట్..
కేప్‌టౌన్‌లో ఏం జరగనుంది? టీమిండియా హ్యాట్రిక్ విజయం ఎలా సాధిస్తుంది? ఇది తెలియాలంటే ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డేల చరిత్ర తెలుసుకోవాలి. ఇప్పటి వరకు కేప్‌టౌన్‌లో ఇరు జట్లు 4 సార్లు తలపడ్డాయి. అంటే కేప్‌టౌన్‌లో ఇరు జట్లు 4 వన్డేలు ఆడాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌లు గెలవగా, ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో 2 మ్యాచుల్లో విజయం సాధించింది.
హ్యాట్రిక్ విజయం దక్కేనా..
కేప్ టౌన్‌లో హ్యాట్రిక్ విజయం సాధించడం ద్వారా టీమ్ ఇండియా విశ్వసనీయతను ఎలా కాపాడుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో ఆడిన చివరి 4 వన్డేల్లో భారత్ చివరి రెండు వన్డేల్లోనూ విజయం సాధించింది. 2010 సంవత్సరం తర్వాత భారత్ ఈ రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కేప్‌టౌన్‌లో జరిగిన చివరి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన భారత్ ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే హ్యాట్రిక్ ఖాయం అవనుంది. ఈ విధంగా భారత్ తన విశ్వసనీయతను కూడా కాపడుకుంటుంది. అంటే ప్రస్తుత వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి టీమిండియా తప్పించుకుంటుంది. అలాగే, దక్షిణాఫ్రికా పర్యటనను కూడా విజయంతో ముగించే ఛాన్స్ ఉంటుంది.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే జనవరి 23న అంటే ఆదివారం కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ (ఎన్‌సీజీ)లో జరగనుంది. టాస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుండగా, ఆట మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది.
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇలా చూడండి:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో ఇరు జట్ల మధ్య మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డీడీ స్పోర్ట్స్‌లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. Disney Plus Hotstarలోనూ లైవ్ చూడొచ్చు.
ఇరుజట్లు:
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, ప్రసీద్ధ్ కృష్ణ/నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
దక్షిణాఫ్రికాకు ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జానెమన్ మలన్, ఐదాన్ మర్క్రామ్, రాసి వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఆండిలే ఫెలుక్వాయో, మార్కో జెన్సన్, తబ్రేజ్ షమ్సీ, కేశవ్ మహరాజ్.
Also Read: IND Vs WI: కరోనా ఎఫెక్ట్.. భారత్- వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు..
U19 World Cup 2022: సెంచరీల మోత మోగించిన భారత కుర్రాళ్లు.. ఉగాండాపై భారీ విజయం..