IND vs SA: సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో భారత్ నిరాశపరిచింది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడోరోజు 276 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభిన భారత్ 327 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 55 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. ఎవ్వరు కనీసం రెండెకల స్కోరు కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఇతనికి తోడుగా కాగిసో రబడా 3 వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్ 327 పరుగులకు ఆలౌట్ అయింది.
అంతకు ముందు మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కి ఓపెనర్లు మంచి శుభారంబాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ సాధించాడు. 248 బంతుల్లో 122 పరుగలు చేశాడు. మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేశాడు. పుజారా డకౌట్ అయినా విరాట్ కోహ్లీ 35 పరుగులతో రాణించాడు. రహానె 40 పరుగులతో తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.అయితే మూడో రోజు ఆట ప్రారంభంకాగానే సెంచరీ హీరో రాహుల్(123) అవుట్ కాగా.. ఆ తర్వాత రహనే(48), అశ్విన్(4), పంత్(8), శార్దూల్ ఠాకూర్(4), షమీ(8)లు వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. చివరి వికెట్‌గా బుమ్మా 14 పరుగులు వెనుదిరిగాడు. దీంతో భారత్ 327 పరుగులకు ఆలౌట్ అయింది.