IND vs SA: 642 బంతుల్లోనే ముగిసిందిగా.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో సరికొత్త రికార్డుగా కేప్‌టౌన్ టెస్ట్..

|

Jan 05, 2024 | 10:45 AM

India Vs South Africa Test: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత్ తరపున సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా, ఆఫ్రికా తరుపున ఐడెన్ మార్క్రామ్ సెంచరీ సాధించాడు. ఆఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి సాధించింది.

IND vs SA: 642 బంతుల్లోనే ముగిసిందిగా.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో సరికొత్త రికార్డుగా కేప్‌టౌన్ టెస్ట్..
Ind Vs Sa Test Series Recor
Follow us on

India Vs South Africa Test: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య జరిగిన సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్‌లో ముగిసింది. ఇది 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఓవర్ల (బంతుల పరంగా) మ్యాచ్‌గా నిలిచింది. మొదటి టెస్ట్ మ్యాచ్ 1877లో జరిగింది. అప్పటి నుంచి 2024 వరకు కేవలం 642 బంతుల్లో టెస్టు మ్యాచ్ ముగియడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కేవలం 107 ఓవర్లు మాత్రమే ఇరుజట్లు ఆడాయి. నిజానికి వన్డే మ్యాచ్‌లో ఇరు జట్లు 100 ఓవర్లు ఆడతాయి. అంటే, ఈ మ్యాచ్ కూడా దాదాపు వన్డే మ్యాచ్ లానే జరగడం విశేషం.

92 ఏళ్ల రికార్డు బద్దలు..

టెస్టు మ్యాచ్‌ అతి తక్కువ వ్యవధిలో ముగియడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి ముందు 1932లో అంటే 92 ఏళ్ల క్రితం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ కేవలం 656 బంతుల్లోనే ముగిసింది. తాజాగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ టెస్టు కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ శతాబ్దంలో ఇంత త్వరగా మ్యాచ్ ముగియడంలో ఇదే తొలి టెస్టుగా నిలిచింది.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ఓవర్లు(అంటే వేగంగా ముగిసిన టెస్టులు) ఇవే..

642 బంతులు- భారత్ vs సౌతాఫ్రికా, కేప్ టౌన్, 2024

656 బంతులు – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, మెల్బోర్న్, 1932

672 బంతులు – వెస్టిండీస్ vs ఇంగ్లాండ్, బ్రిడ్జ్‌టౌన్, 1935

788 బంతులు – ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, మాంచెస్టర్, 1888

792 బంతులు – ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, లార్డ్స్, 1888

కేప్‌టౌన్‌లో భారత్‌కు తొలి విజయం..

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలిసారి విజయం సాధించింది. భారత్ 1993లో ఇక్కడ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు 31 ఏళ్ల తర్వాత ఇక్కడ ఏడో మ్యాచ్‌ ఆడుతున్న టీమిండియా తొలిసారి విజయం సాధించింది. న్యూలాండ్స్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌కే కాకుండా ఏ ఆసియా జట్టుకైనా ఇది తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత్ తరపున సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా, ఆఫ్రికా తరుపున ఐడెన్ మార్క్రామ్ సెంచరీ సాధించాడు. ఆఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..