IND vs PAK, Playing XI: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ XIలో హార్దిక్ రీ ఎంట్రీ.. ఇంకా ఎవరున్నారంటే?

IND vs PAK: ఈ మేరకు టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కేవలం 8 రోజుల్లో రెండోసారి తలపడనున్నాయి.

IND vs PAK, Playing XI: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ XIలో హార్దిక్ రీ ఎంట్రీ.. ఇంకా ఎవరున్నారంటే?
India Vs Pak

Updated on: Sep 04, 2022 | 7:15 PM

IND vs PAK, Super 4: భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ లో మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కేవలం 8 రోజుల్లో రెండోసారి తలపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్ మైదానంలో పోరు రసవత్తరంగా సాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 సంవత్సరాల తర్వాత 8 రోజుల వ్యవధిలో ఇరు జట్లు రెండోసారి తలపడడం ఇదే తొలిసారి. అంతకుముందు 2018 ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరగగా, రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా

ప్రత్యేక క్లబ్‌లో విరాట్ కోహ్లీ..

టీ20 ఇంటర్నేషనల్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 97 సిక్సర్లు కొట్టాడు. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ నుంచి మూడు సిక్సర్లు బాదితే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తయినట్లే. ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విరాట్ బ్యాట్‌లో 4 సిక్సర్లు వచ్చాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 9 మంది బ్యాట్స్‌మెన్లు 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టారు.