IND vs PAK: చరిత్ర సృష్టించిన రోహిత్ సేన.. టీ20ల్లో డేంజరస్ టీంగా రికార్డ్.. అదేంటంటే?

Team India Lowest Totals: న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏ పోరులో టీమిండియా ఉత్కంఠ విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది.

IND vs PAK: చరిత్ర సృష్టించిన రోహిత్ సేన.. టీ20ల్లో డేంజరస్ టీంగా రికార్డ్.. అదేంటంటే?
Team India

Updated on: Jun 10, 2024 | 6:30 AM

Team India Lowest Totals: న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏ పోరులో టీమిండియా ఉత్కంఠ విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో టీ20ల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది. అంతకుముందు 2012లో 133/9 అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. అయితే, న్యూయార్క్‌లో ఈ అత్యల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో సఫలమైంది. దీంతో టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరుగా నిలిచింది.

టీ20ల్లో 130 ప్లస్ లక్ష్యాన్ని భారత్ ఎప్పుడూ డిఫెండ్ చేయలేదు. 2016లో జింబాబ్వేపై 138 పరుగులతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో డిఫెండ్ చేసిన అత్యల్ప టార్గెట్‌గా నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌లలో, 2016లో బంగ్లాదేశ్‌పై 146 పరుగులతో భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప మరో అత్యల్ప స్కోరు.

టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా అత్యల్ప స్కోర్లు.. (పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు)

138 — vs జింబాబ్వే (హరారే; 2016)

144 — vs ఇంగ్లాండ్ (నాగ్‌పూర్; 2017)

146 — vs బంగ్లాదేశ్ (బెంగళూరు; 2016)

152 — vs దక్షిణాఫ్రికా (కొలంబో; 2012)

153 — vs దక్షిణాఫ్రికా (డర్బన్; 2007)

టీ20ల్లో టీమిండియా అత్యల్ప స్కోర్లు..

146 — vs బంగ్లాదేశ్ (బెంగళూరు; 2016)

152 — vs దక్షిణాఫ్రికా (కొలంబో; 2012)

153 — vs దక్షిణాఫ్రికా (డర్బన్; 2007)

157 — vs పాకిస్థాన్ (జోహన్నెస్‌బర్గ్; 2007)

159 — vs ఆఫ్ఘనిస్తాన్ (కొలంబో; 2012)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..