IND vs PAK: టీమిండియా టార్గెట్ 172.. ఓపెనర్లు ఏం చేస్తారో..?

Team India: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన రెండో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 58 పరుగులు చేశాడు. భారత్‌కు చెందిన శివమ్ దుబే 2 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్లు 4 క్యాచ్‌లు వదిలేశారు.

IND vs PAK: టీమిండియా టార్గెట్ 172.. ఓపెనర్లు ఏం చేస్తారో..?
Team India

Updated on: Sep 21, 2025 | 10:07 PM

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన రెండో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 58 పరుగులు చేశాడు. భారత్‌కు చెందిన శివమ్ దుబే 2 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్లు 4 క్యాచ్‌లు వదిలేశారు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ పవర్ ప్లేలో త్వరగానే ఆరంభించింది. జస్ప్రీత్ బుమ్రాను లక్ష్యంగా చేసుకుని మొదటి ఆరు ఓవర్లలో 55 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోరింగ్ రేటు మందగించింది. చివరికి, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మరియు మహ్మద్ నవాజ్ జట్టును 150 దాటించారు.

భారత్, పాక్ జట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..