IND vs PAK: ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్‌లకు బంపర్ డిమాండ్.. దెబ్బకు వెబ్‌సైట్ క్రాష్..

|

Aug 16, 2022 | 2:01 AM

ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల టిక్కెట్ల బుకింగ్ ఆగస్టు 16న ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కోసం బుకింగ్స్ నడుస్తుండగా అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది.

IND vs PAK: ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్‌లకు బంపర్ డిమాండ్.. దెబ్బకు వెబ్‌సైట్ క్రాష్..
Ind Vs Pak
Follow us on

ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు తొలి మ్యాచ్ ఆగస్టు 28న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ టోర్నీకి భారత జట్టు పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆసియా కప్‌నకు భారత జట్టు ఆగస్టు 20న బయలుదేరుతుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. అదే సమయంలో ఈ మ్యాచ్ టిక్కెట్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే.డిమాండ్ తట్టుకోలేక అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది.

UAEలో మ్యాచ్ టిక్కెట్‌లను బుక్ చేసుకునేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్లలో ఒకటైన ప్లాటినమ్‌లిస్ట్‌లో టిక్కెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. అదే సమయంలో ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటల వరకు, వెబ్‌సైట్ ట్రాఫిక్‌లో 70 వేల బంపర్ పెరుగుదల ఉంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల జారీలో జాప్యంపై అభిమానులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత్‌, పాక్‌ జట్లకు అభిమానుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అయితే, వెబ్‌సైట్ క్రాష్ తర్వాత, టిక్కెట్లు 2:30 వరకు అందుబాటులో ఉండవని పేర్కొంది. మరోవైపు, అధికారిక టికెటింగ్ భాగస్వామి వెబ్‌సైట్ కొన్ని సందర్భాల్లో 6 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు వేచి ఉండే సమయంతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి క్యూను ఏర్పాటు చేసింది. ఇండో-పాక్ మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇరు దేశాల అభిమానులు ఈ మ్యాచ్‌ను మిస్ చేసుకోవాలని కోరుకోవడం లేదు.

ఆగస్టు 28 న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌..

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌ 2022లో ఆగస్టు 28 న భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. వాస్తవానికి, గ్రూప్ దశ తర్వాత సూపర్-4లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు కూడా ముఖాముఖి తలపడగలవని నమ్ముతారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆగస్టు 28న భారత్-పాక్ మధ్య గ్రూప్ మ్యాచ్ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ఆసియా కప్ 2022 ఫైనల్ సెప్టెంబర్ 11న జరుగుతుంది.