IND vs NZ: జెర్సీపై టేప్‌ అంటించిన భారత యంగ్ బ్యాట్స్‌మెన్.. ఎందుకో తెలుసా?

|

Nov 20, 2021 | 3:08 PM

Rishabh Pant: న్యూజిలాండ్‌తో రాంచీ, JSCA స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత కీపర్ రిషబ్ పంత్ జెర్సీ‌పై టేప్ అతికించి ఉంచాడు.

IND vs NZ: జెర్సీపై టేప్‌ అంటించిన భారత యంగ్ బ్యాట్స్‌మెన్.. ఎందుకో తెలుసా?
India Vs New Zealand Rishabh Pant
Follow us on

India vs New Zealand: రోహిత్ శర్మ నాయకత్వంలో రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20ఐ సిరీస్‌ను గెలుచుకుంది. జైపూర్‌లో జరిగిన మొదట టీ20లో విజయం సాధించిన తర్వాత రాంచీలో కివీస్‌ను ఓడించారు. అభిమానులు ఆటను ఆస్వాదించగా, అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ జెర్సీ. రాంచీలోని JSCA స్టేడియంలో రిషబ్ పంత్ కుడి ఛాతీపై టీ-షర్ట్ టేప్ ఉన్నట్లు అనిపించింది.

అయితే చాలా మంది టేప్‌కి కారణాన్ని తెలుసుకోవాలని కోరుకున్నారు. అసలు విషయం తెలిసి షాకయ్యారు. ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా ధరించిన జెర్సీ అని అవాక్కయ్యారు.

ఆ జెర్సీపై టీ20 వరల్డ్ కప్ 2021 లోగో ఉండడంతో, దానిని ద్వైపాక్షిక సిరీస్‌లలో ధరించేందుకు ఐసీసీ అనుమతించదు. అందుకే ఆ సింబల్‌పై టేప్ వేశాడు. ఇతర భారత ఆటగాళ్లు రెగ్యులర్ జెర్సీలో కనిపించగా, పంత్ మాత్రమే టీ20 ప్రపంచకప్ 2021 జెర్సీని ధరించడం గమనార్హం. అయితే మరి ఇలా ఎందుకు చేశాడో మాత్రం తెలియరాలేదు.

పాకిస్తాన్, బ్లాక్‌క్యాప్స్‌తో వరుసగా ఓడిపోయిన తర్వాత ప్రపంచ కప్‌లో భారతదేశం ప్రయాణం సూపర్ 12 దశలోనే ముగిసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

రెండవ టీ20ఐ విషయానికొస్తే, ఇటీవల ముగిసిన IPL 2021 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 4-0-25-2 గణాంకాలతో అద్భుత బౌలింగ్ చేసి డెబ్యూ మ్యాచులో ఆకట్టుకుని అవార్దు అందుకున్నాడు. ప్లేయింగ్ XIలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా చూస్తున్నాడు.

Also Read:Cricket: ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ అతనే.. త్వరలో అధికారిక ప్రకటన చేయనన్న సీఏ..

IND vs NZ: సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి వచ్చిన రోహిత్‌ అభిమాని.. ఏం చేశాడంటే..