NZ Vs IND: 26 బంతుల్లో హాఫ్ సెంచరీ.. కివీస్‌లో భారత వికెట్ కీపర్ తుఫాన్ ఇన్నింగ్స్‌.. 14 ఏళ్ల నాటి రికార్డులకు బ్రేకులు..

|

Feb 22, 2022 | 5:09 PM

Indian Women's Cricket Team: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే 18 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాటర్ తుఫాను ఇన్నింగ్స్‌తో 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

NZ Vs IND: 26 బంతుల్లో హాఫ్ సెంచరీ.. కివీస్‌లో భారత వికెట్ కీపర్ తుఫాన్ ఇన్నింగ్స్‌.. 14 ఏళ్ల నాటి రికార్డులకు బ్రేకులు..
India Vs New Zealand Richa Ghosh
Follow us on

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ (ODI Series in New Zealand)లో భారత మహిళా క్రికెట్(Indian Women’s Cricket Team) జట్టు పరిస్థితి దారుణంగా మారింది. జట్టు ఆటతీరు క్రికెట్ అభిమానులను నిరాశ పరిచేలా ఉంది. కానీ, ఈ నిరాశా, నిస్పృహల మధ్య ఓ ప్లేయర్ ఆకట్టుకుంది. గుర్తుండిపోయేలా ఓ ఇన్నింగ్స్‌ ఆడి రికార్డు కూడా నెలకొల్పింది. భారత జట్టుకు చెందిన 18 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్(Richa Ghosh).. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే 14 ఏళ్ల నాటి భారత రికార్డును బ్రేక్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆమె తుఫాన్ ఇన్నింగ్స్‌ కూడా జట్టును గెలిపించలేకపోయింది.

వర్షం కారణంగా నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల ముందు ఉంచింది. దీంతో భారత జట్టు 17.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఇందులో రిచా ఘోష్ 52 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.

రిచా ఘోష్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో పలు రికార్డులు బద్దలు..
రిచా ఘోష్ ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో భారత్ తరపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె 52 పరుగుల ఇన్నింగ్స్‌లో, కేవలం 26 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసింది. ప్రపంచ క్రికెట్‌లో 26 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్లు కేవలం 6గురు మాత్రమే ఉన్నారు.

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రిచా ఘోష్.. 14 ఏళ్ల క్రితం మరో భారత మహిళ రికార్డును బద్దలు కొట్టింది. గతంలో ఈ భారత రికార్డు రుమేలీ ధర్ పేరిట ఉండేది. రుమేలీ ధర్ 2008లో శ్రీలంకపై 28 బంతుల్లో తన యాభైని పూర్తి చేసింది.

మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్ కీపర్..
న్యూజిలాండ్‌పై రిచా ఘోష్ తన 52 పరుగుల ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టింది. దీంతో మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు, మిగిలిన వికెట్ కీపర్లు కలిసి 4 సిక్సర్లు మాత్రమే కొట్టారు. అదేంటంటే.. 18 ఏళ్ల రిచా ఘోష్ తన ఈ ఇన్నింగ్స్‌తో రెండు రికార్డులను బద్దలు కొట్టింది.

Also Read: IND vs SL T20I Series: లంకతో భారత్ తలపడితే.. రన్స్ 200 దాటాల్సిందే.. ఇరుజట్లు చేసిన 5 భారీ స్కోర్‌లు ఇవే..!

Viral Video: ఇదేంది బ్రో.. క్యాచ్ వదిలేశాడని కొట్టేస్తావా.. పాక్ బౌలర్ చేసిన పనికి ఫైరవుతోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో!