IND vs NZ, Day 3, 1st Test: ముగిసిన కివీస్ తొలి ఇన్నింగ్స్.. 356 పరుగుల ఆధిక్యం.. 50 ఏళ్ల రికార్డ్ బ్రేక్

IND vs NZ Score, Day 3, 1st Test: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ జట్టు 356 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ మూడో రోజైన శుక్రవారం కివీస్ 180/3 స్కోరుతో ఆట ప్రారంభించింది. 22 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు.

IND vs NZ, Day 3, 1st Test: ముగిసిన కివీస్ తొలి ఇన్నింగ్స్.. 356 పరుగుల ఆధిక్యం.. 50 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Ind Vs Nz 1st Test Score

Updated on: Oct 18, 2024 | 1:25 PM

IND vs NZ Score, Day 3, 1st Test: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ జట్టు 356 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ మూడో రోజైన శుక్రవారం కివీస్ 180/3 స్కోరుతో ఆట ప్రారంభించింది. 22 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. రచిన్ ఒక వైపు నుంచి బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మరొక వైపు నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. తొలి సెషన్‌లో డారిల్ మిచెల్ (18 పరుగులు), టామ్ బ్లండెల్ (5 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్ (14 పరుగులు), మాట్ హెన్రీ (8 పరుగులు) ఔటయ్యారు.

రవీంద్ర – సౌదీల సెంచరీ భాగస్వామ్యం: తొలి ఓవర్లలో 4 వికెట్లు పతనమైన తర్వాత టిమ్ సౌథీ రచిన్ రవీంద్రకు అండగా నిలిచి జట్టు స్కోరును 370 పరుగులకు చేర్చాడు. వీరిద్దరి మధ్య 8వ వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. భారత గడ్డపై 8 వికెట్లకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రవీంద్ర, సౌదీ 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్ మరియు విలియం ఓ’రూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..