IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన రాంచీ టీ20లో హర్షల్ పటేల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆది నుంచే కివీస్ బ్యాట్స్‌మెన్లపై తన అస్త్రాలను సంధించాడు. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్‌ల బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ 10 ఎకానమీతో పరుగులు చేయగా హర్షల్ పటేల్ ఎకానమీ మాత్రం 6.25 మాత్రమే. తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్‌లో హర్షల్ 4 ఓవర్లలో అంటే 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు పెద్ద వికెట్లు సాధించాడు. రాంచీ టీ20లో మహమ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్ కు అవకాశం లభించింది. ఎడమ చేతి గాయం కారణంగా సిరాజ్ రాంచీ టీ20కి దూరమయ్యాడు. అతని స్థానంలో హర్షల్ పటేల్ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భారత్ తరఫున మ్యాచ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
డారెల్ మిచెల్ హెర్షెల్ మొదటి అంతర్జాతీయ వికెట్..
న్యూజిలాండ్‌తో జరిగిన రాంచీ టీ20లో హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కేవలం 2 బౌండరీలు మాత్రమే ఇచ్చి13 డాట్ బాల్స్ సంధించాడు. హర్షల్ పటేల్ తొలి అంతర్జాతీయ బాధితుడు కివీస్ బ్యాట్స్‌మెన్ డారెల్ మిచెల్. రెండో వికెట్ మార్క్ చాప్‌మన్. జైపూర్‌లో జరిగిన తొలి టీ20లో చాప్‌మన్ 63 పరుగులతో అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
హర్షల్ IPL 2021లో అత్యంత విజయవంతమైన బౌలర్
జైపూర్ టీ20 మ్యాచ్‌లో సిరాజ్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. రాంచీ మ్యాచ్ ద్వారా సిరీస్ గెలవాలని ఆశతో భారత్ హర్షల్ పటేల్ నుంచి అద్భుతమైన బౌలింగ్‌ను ఆశించింది దీనికి అతడు పూర్తిగా న్యాయం చేశాడు. ఐపీఎల్ 2021లో విరాట్ కోహ్లీ జట్టుతో ఆడుతూ 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తూ మొదటి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సాధించాడు. కివీ జట్టులోని ఇద్దరు బలమైన బ్యాట్స్‌మెన్‌లను అతను అవుట్ చేశాడు. దీంతో మూడో టీ20లో ఆడేందుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు.
Overs – 4
Dots – 13
Runs – 25
Wickets – 2An impressive spell from Harshal Patel on his T20I debut ??#HarshalPatel #India #INDvNZ #Cricket pic.twitter.com/069FteSREA
— Wisden India (@WisdenIndia) November 19, 2021