IND vs NZ: అతడి స్థానంలో హర్షల్ పటేల్ లేదా అవేష్ ఖాన్‎ను తీసుకోవాలి.. వారిద్దరు అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నారు..

|

Nov 19, 2021 | 9:46 AM

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ ముగ్గురు పేస్ బౌలర్లతో భారత్ ఆడింది...

IND vs NZ: అతడి స్థానంలో హర్షల్ పటేల్ లేదా అవేష్ ఖాన్‎ను తీసుకోవాలి.. వారిద్దరు అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నారు..
Harshal Patel
Follow us on

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ ముగ్గురు పేస్ బౌలర్లతో భారత్ ఆడింది. ఆఖరి ఓవర్‌లో మిచెల్ సాంట్‌నర్ కొట్టిన షాట్‌తో సిరాజ్ చేతికి గాయమైంది. ఎలాగోలా పూర్తి ఓవర్‌ను పూర్తి చేశాడు. ఒకవేళ సిరాజ్ శుక్రవారం మ్యాచ్‌లో ఆడేందుకు అందుబాటులో లేకుంటే ఐపీఎల్ స్టార్లు హర్షల్ పటేల్ లేదా అవేష్ ఖాన్ తీసుకునే అవకాశం ఉంది.

రాంచీ స్లో వికెట్‌కు పటేల్ అనుకూలిస్తాడని, అతని ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని దినేష్ కార్తీక్ అన్నాడు. ” ఇద్దరూ ఇప్పటివరకు తమ కెరీర్‌లో అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నారు. వారిలో ఎవరినైనా ఆడవచ్చు. నేను వ్యక్తిగతంగా హర్షల్ పటేల్ మెరుగ్గా ఉంటాడని భావిస్తున్నాను. ఎందుకంటే రాంచీలో కొంచెం స్లో వికెట్ ఉంటుంది. హర్షల్ పటేల్ చాలా మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు.” అని చెప్పాడు. “దీపక్ చాహర్, భువీలలో 135 వేగంతో బౌలింగ్ చేస్తారు. మరింత వేగంతో బౌలింగ్ కావాలనుకుంటే అవేష్ ఖాన్ ఎంపిక చేసుకోవాలి” అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.

భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా కూడా కార్తీక్ అభిప్రాయాన్ని సమర్థించాడు. హర్యానా బౌలర్ తన స్లో బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడని చెప్పాడు. ” సిరాజ్ స్థానంలో వేరేవారిని తీసుకోవాలనుకుంటే నేను బహుశా హర్షల్‌ తీసుకుంటాను” అని జడేజా అన్నాడు. ఈ రోజు రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20 ఆడనుంది.

Read Also.. Martin Guptill: అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం.. అతడు వేసే బంతులు వైవిధ్యంగా ఉంటాయి..