India vs New Zealand, 1st Test: బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రవిడ్-రహానే.. ఎక్కడికి వెళ్లారంటే?

|

Nov 23, 2021 | 12:09 PM

Rahul Draivd- Ajinkya Rahane:కెప్టెన్ అజింక్య రహానె, కోచ్ రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ సూచనలను పట్టించుకోకుండా, బయోబబుల్‌ను దాటుకుని వెళ్లి మైదానాన్ని పరిశీలించారు. గతంలో IPL సమయంలో కూడా..

India vs New Zealand, 1st Test: బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రవిడ్-రహానే.. ఎక్కడికి వెళ్లారంటే?
Ind Vs Nz, 1st Test
Follow us on

Rahul Draivd- Ajinkya Rahane: టీమ్ ఇండియా కెప్టెన్ అజింక్యా రహానే, కోచ్ రాహుల్ ద్రవిడ్ సోమవారం బయో బబుల్ సర్కిల్‌ను ఛేదించి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. మైదానాన్ని, పిచ్‌ను నిశితంగా పరిశీలించారు.

క్యూరేటర్ ఎల్. ప్రశాంత్‌రావును కలిసి వికెట్‌ స్వభావం గురించి కూడా మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల పాటు కొత్త డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. కోచ్ ప్రాక్టీస్ పిచ్‌లను కూడా పరిశీలించి వాటిని మెరుగుపరచాలని కోరారు. ప్రాక్టీస్ పిచ్‌ల స్థాయిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది.

బీసీసీఐ సూచనలను పట్టించుకోలే..
బీసీసీఐ ఖచ్చితంగా టీమిండియాకు బయో బబుల్ రూల్స్‌ను అతిక్రమించవద్దని సూచించింది. అయితే కెప్టెన్ అజింక్య రహానె, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆ సూచనలను పట్టించుకోకుండా, బయోబబుల్‌ను దాటుకుని వెళ్లి మైదానాన్ని పరిశీలించారు. గతంలో IPL సమయంలో కూడా KKR (కోల్‌కతా నైట్ రైడర్స్)కు చెందిన కొంతమంది ఆటగాళ్లు బయో బబుల్ సర్కిల్‌ను దాటారు. దీని తర్వాత ఆ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఆటగాళ్లకు బీసీసీఐ జరిమానా కూడా విధించింది. మరి కెప్టెన్ రహానె, కోచ్ ద్రవిడ్‌‌లపై ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.

విమానాశ్రయం నుంచి హోటల్‌కు, ఆపై గ్రీన్ పార్క్‌కు చేరుకున్న కెప్టెన్ అజింక్యా రహానె అప్పటికే కాన్పూర్‌ చేరుకున్నాడు. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ సోమవారం కాన్పూర్ చేరుకున్నాడు. హోటల్ నుంచి అజింక్యా రహానెతో కలిసి నేరుగా గ్రీన్ పార్క్ మైదానానికి చేరుకున్నాడు.

Also Read: IND vs NZ, 1st Test: తొలి టెస్టులో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేది ఎవరు? రహానె-ద్రవిడ్‌ చూపులో ఉన్నది వారేనా..!

50 మ్యాచుల్లో 20 ఛాన్స్‌లు మిస్.. 2 ఏళ్లుగా విరాట్ కోహ్లీ నిరీక్షణ.. టీమిండియా కెప్టెన్‌‌‌ను ఊరించి, ఉసూరుమనిపిస్తున్నది ఎంటో తెలుసా?