మరో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వదానికి సిద్దమైంది విశాఖపట్నం. నాలుగేళ్ల తర్వాత విశాఖ లోని వి డీ సీ ఏ – వైఎస్సార్ ఏ సీ ఏ ఇంటర్నేషనల్ స్టేడియం లో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 తేదీ వరకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ వివరాలను వెల్లడించింది. ఈ సారి ప్రత్యేకంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించింది ఏసీఏ. విశాఖపట్నం, మధురవాడ లోని వి డీ సీ ఏ – వైఎస్సార్ ఏ సీ ఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాట్లకు సిద్ధం అయింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన మ్యాచ్ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. నిర్వాహక కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎ.మల్లికార్జున దీనికి సంబంధించి వివరాలను వెల్లడిస్తూ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణం లో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులో
ఉంచుతామన్నారు ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి. గురువారం మీటింగ్ కు హాజరైన ఆయన టీవీ9 తో మాట్లాడుతూ, టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఈనెల 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. పేటీఎం యాప్ ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తామని, ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు వివరించారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా ఉంటుందన్నారు.
టెస్ట్ మ్యాచ్ కాబట్టి స్టేడియం రోజూ నిండే అవకాశం ఉండదు. స్టేడియం కెపాసిటీ 27 వేలు. కాబట్టి రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు గోపీనాథ్ వివరించారు. అందుకోసం ముందుగా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకోసం వైఎస్సార్, స్వర్ణభారతి స్టేడియాల్లో 26 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
England’s tour of India, 2024:
1st Test: 25th Jan, Hyderabad
2nd Test: 2nd Feb, Vizag
3rd Test: 15th Feb, Rajkot
4th Test: 23rd Feb, Ranchi
5th Test: 7 March, Dharamshala#IndvsEng pic.twitter.com/kMqvwZjA4U— Hammer and Gavel (@hammer_gavel) January 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..