IND vs ENG: బాల్ టాంపరింగ్..! బూట్లతో బంతి ఆకారం మార్చేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రయత్నం.. హెచ్చరించని అంపైర్లు

|

Aug 16, 2021 | 7:31 AM

Ball Tampering: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టీంమధ్య లార్డ్స్ టెస్ట్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆట నాల్గవ రోజు బాగా వేడెక్కింది. ఓ వైపు కోహ్లీ-అండర్సన్‌ల మధ్య మాటల యుద్ధం.. మరోవైపు బాల్ టాంపరింగ్ వ్యవహారం.

IND vs ENG: బాల్ టాంపరింగ్..! బూట్లతో బంతి ఆకారం మార్చేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రయత్నం.. హెచ్చరించని అంపైర్లు
England Players Ball Tampering
Follow us on

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (india vs England) మధ్య జరుగుతోన్న లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ హీటెక్కింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, అండర్‌సన్ మధ్య మాటల యుద్ధంతో మైదానం ఒక్కసారిగా వేడెక్కిన విషయం తెలిసిందే. అయితే నాలుగో రోజు మరో వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ ఫీల్డర్లు షూ స్పైక్‌లతో బంతి లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వీడియో కనిపించింది. మ్యాచ్ సమయంలో ఈ వీడియో టీవీలో కనిపించింది. అయితే, వీడియోలో బూట్లు మాత్రమే కనిపించడంతో బంతిని ట్యాంపరింగ్ చేసిన ఆటగాళ్లు ఎవరనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, పసుపు సోల్ ఉన్న ఆటగాడు షూ కింద బంతిని నొక్కినట్లు కనిపించింది. బంతి నుంచి స్వింగ్ పొందడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ బౌలర్ల వైపు నుంచి ఇలాంటి ప్రయత్నాలు కనిపించడంతో.. బాల్ టాంపరింగ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, అయితే, ఈ వీడియోలో మార్క్ వుడ్, రోరీ బర్న్స్ ఉన్నట్లు పేర్కొంటున్నాడు. బ్రాడ్ టెస్ట్ సిరీస్‌కి దూరంగా ఉన్నాడు. కానీ, అతను లార్డ్స్ టెస్టులో కామెంటేటర్‌గా చేస్తున్నాడు. షూ కింద బంతిని నొక్కిన సంఘటనను బ్రాడ్ కూడా సమర్థించడం గమనార్హం. మార్క్ వుడ్ లేదా రోరీ బర్న్స్ పాదాల కింద నుంచి బంతిని పైకి తీయాలని ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ బదులుగా, మొత్తం వీడియోను చూడాలని అతను పేర్కొన్నాడు.

మ్యాచ్ రిఫరీ లేదా అంపైర్ బంతిని పరిశీలిస్తారా..?
సోనీ స్పోర్ట్స్ కామెంటేటర్ హర్ష భోగ్లే, మాట్లాడుతూ మ్యాచ్ రిఫరీ లేదా అంపైర్ బంతిని పరిశీలించి, అనంతరం పలు చర్యలు తీసుకుంటారని తెలిపాడు. అవసరమైతే బంతి మార్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీనిపై ట్వీట్ చేయడం ద్వారా బ్రాడ్ కూడా స్పందించాడు. బంతి పరిస్థితి బాగోలేనప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని వెల్లడించాడు. బంతి సిక్సర్ కొట్టినప్పుడు అది ప్రేక్షకుల్లోకి వెళ్తేనే బాల్‌ను మార్చుతారు. బాల్‌ మంచిగా ఉంటే మార్చడం అనవసరం. కానీ, తమ బూట్లతో బంతిని రాకడంపై ఇంగ్లీష్ ఆటగాళ్లను అంపైర్లు కూడా హెచ్చరించలేదని తెలుస్తోంది.

Also Read:

Vinesh Fogat: క్షమాపణ చెప్పిన వినేశ్ ఫొగాట్.. తదుపరి చర్యలకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం

IND vs ENG 2nd Test: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా వినియోగించుకుంటుందా?