IND vs ENG: బౌన్సర్లతో భయపెట్టిన టీమిండియా బౌలర్.. తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి చూడలేదన్న ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్

|

Aug 25, 2021 | 8:45 PM

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ భారత బౌలింగ్ ముందు మోకరిల్లారు. ఇందులో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ ఆండర్సన్‌కు అత్యంత ఘోరమైన పరిస్థితి ఎదురైంది.

IND vs ENG: బౌన్సర్లతో భయపెట్టిన టీమిండియా బౌలర్.. తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి చూడలేదన్న ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్
James Anderson Batting
Follow us on

IND vs ENG: లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో, జస్ప్రీత్ బుమ్రా జేమ్స్ ఆండర్సన్ పై బౌన్సర్ల వర్షం కురిపించాడు. దీని కారణంగా ఇంగ్లీష్ ప్లేయర్ బాగా ఇబ్బంది పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత, జేమ్స్ ఆండర్సన్ కూడా దీని గురించి బుమ్రాతో మాట్లాడి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇప్పుడు జేమ్స్ ఆండర్సన్ పోడ్‌కాస్ట్‌లో దీని గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాడు. బుమ్రా తనపై బౌన్సర్లను బౌల్ చేసినప్పుడు తాను ఆశ్చర్యపోయాను. తనకు కోలుకునే అవకాశం కూడా రాలేదని చెప్పుకొచ్చాడు.

ది టెయిలెండర్స్ అనే పోడ్‌కాస్ట్‌తో అండర్సన్ మాట్లాడుతూ, ‘తనతో బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ జో రూట్, బుమ్రా సాధారణంగా విసిరే వేగంతో బంతిని వేయడం లేదని చెప్పాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా పిచ్ నెమ్మదిగా ఉందని పేర్కొన్నారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని బ్యాట్స్‌మన్‌లందరూ చెప్పినందున నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, బుమ్రా సాధారణంగా బౌలింగ్ చేసేంత వేగంగా బౌలింగ్ చేయడం లేదని జో తెలిపాడు. ఆపై మొదటి బంతి గంటకు 145 కిమీ వేగంతో దూసుకొచ్చింది. నా కెరీర్‌లో నేను ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు’ చెప్పుకొచ్చాడు.

బుమ్రా ఆ ఓవర్లలో వరుసగా నోబాల్స్..
అండర్సన్‌కు బౌలింగ్ చేస్తున్నప్పుడు, బుమ్రా కూడా నాలుగు నో బాల్స్ వేశాడు. అతని ఓవర్లలో 10-11 బంతులు ఉన్నాయి. అండర్సన్ ఇంకా ఇలా అన్నాడు.. ‘ఒక ఓవర్లో బహుశా 10, 11 లేదా 12 బంతులు బుమ్రా సంధించాడు. అతను ఒకదాని తరువాత ఒకటిగా అనేక నో బాల్స్ వేశాడు’ అని పేర్కొన్నాడు.

బుమ్రా అండర్సన్ ను షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టిన తరువాత ఇంగ్లండ్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. మ్యాచ్ ఐదవ రోజు, బుమ్రా బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, ఇంగ్లీష్ బౌలర్లు కూడా షార్ట్ పిచ్ బౌలింగ్ చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. షమితో బుమ్రా 89 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: 

Virat Kohli: కేరళ రెస్టారెంట్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..!

IND Vs ENG: విజృంభించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. కుప్పకూలిన కోహ్లీసేన.. 78 పరుగులకే ఆలౌట్..

INDW vs AUSW: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఉమెన్స్ ప్రకటన.. ముగ్గురు కొత్త ముఖాలకు అవకాశం.. వీరికి మాత్రం నో ఛాన్స్!