IND vs ENG: 89 ఏళ్లుగా వెంటాడుతోన్న శని.. 4వ టెస్ట్‌లోనూ టీమిండియాకు ఓటమే..?

India vs England 4th Test: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జులై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గవ టెస్ట్ ఆడనుంది. ఇక్కడ టీమిండియా రికార్డ్ చాలా పేలవంగా ఉంది.

IND vs ENG: 89 ఏళ్లుగా వెంటాడుతోన్న శని.. 4వ టెస్ట్‌లోనూ టీమిండియాకు ఓటమే..?
Manchester, Old Trafford

Updated on: Jul 16, 2025 | 8:35 PM

Manchester Old Trafford: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జులై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గవ టెస్ట్ ఆడనుంది. లార్డ్స్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన టెస్ట్‌లో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు సిరీస్‌ను మరోసారి సమం చేయాలంటే, టీమ్ ఇండియా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలి. ఈ మైదానంలో భారత జట్టు టెస్ట్ రికార్డును చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టీం ఇండియా రికార్డ్..

1936లో ఈ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇది డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 9 టెస్ట్‌లు ఆడిన టీమిండియా ఒక్కదానిలోనూ గెలవలేదు. ఇందులో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోగా, ఐదు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత జట్టు చివరిసారిగా 2014 ఆగస్టులో ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అందులో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

11 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టిన భారత్..

దాదాపు 11 సంవత్సరాల తర్వాత టీం ఇండియా ఇక్కడ టెస్ట్ ఆడనుంది. అంటే, ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది సభ్యులకు మాంచెస్టర్ కొత్త అనుభవంగా ఉంటుంది. ఇంగ్లాండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 84 టెస్టులు ఆడింది. వాటిలో 33 గెలిచింది. 15 ఓడిపోయింది. 36 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఇంగ్లాండ్ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ జో రూట్‌ను ఆపడం భారత జట్టుకు చాలా ముఖ్యం.

రూట్ నంబర్-1 బ్యాట్స్‌మన్..

ఈ మైదానంలో జో రూట్ 11 టెస్ట్ మ్యాచ్‌ల్లో 978 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక్కడ అతని అత్యధిక స్కోరు 254 పరుగులు. లార్డ్స్‌లో తన 37వ టెస్ట్ సెంచరీ సాధించిన తర్వాత, రూట్ మరోసారి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్ ఆశాకిరణంగా మారనున్నాడు. సిరీస్‌లో నిలవాలంటే టీమ్ ఇండియా నాల్గవ టెస్ట్ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అదే సమయంలో, ఇంగ్లాండ్ జట్టు మరో విజయంతో సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని పొందుతుంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..