
IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మూడో మ్యాచ్ జూలై 10 నుంచి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. మొదటి టెస్ట్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోగా, రెండో టెస్ట్‌లో భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో అద్భుత విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో జస్ ప్రీత్ బుమ్రా లార్డ్స్ టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఈ చారిత్రాత్మక మైదానంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఎలా ఆడారు, గత రికార్డులు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
లార్డ్స్‌లో జస్ ప్రీత్ బుమ్రా రికార్డు
జస్ ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు లార్డ్స్‌లో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ మైదానంలో బూమ్రా బౌలింగ్ సగటు 37.33. ఇది అంత చెత్త రికార్డు కాకపోయినా, ఇదే మైదానంలో తన తోటి పేసర్ మహ్మద్ సిరాజ్ రికార్డు ముందు బుమ్రా ప్రదర్శన వెనుకబడిపోయిందని చెప్పొచ్చు.
లార్డ్స్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన
మహ్మద్ సిరాజ్ కూడా లార్డ్స్‌లో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ అతని ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. సిరాజ్ ఆ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 15.75. ఈ మైదానంలో అతడు 32 పరుగులు ఇచ్చి 4వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో కూడా సిరాజ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. అక్కడ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో లార్డ్స్ మ్యాచ్‌లో సిరాజ్ ఒక కీలక ఆటగాడిగా మారనున్నాడు.
ఆశాకిరణంగా ఆకాష్ దీప్
ఆకాష్ దీప్ కూడా లార్డ్స్ టెస్ట్‌లో ఆడతాడని అంచనా. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేసి, 10 వికెట్లు తీశాడు. దీంతో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శనను బట్టి చూస్తే, అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించేందుకు అవకాశం లేదు. ఆకాష్ దీప్ ఎడ్జ్‌బాస్టన్ మ్యాజిక్‌ను లార్డ్స్‌లో కూడా రిపీట్ చేస్తాడా లేదా అని అభిమానులు, ఎదురు చూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..