IND vs ENG 2nd Test Day 3: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు..

|

Aug 14, 2021 | 11:29 PM

IND vs ENG 2nd Test: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌ 10 వికెట్ల నష్టానికి..

IND vs ENG 2nd Test Day 3: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు..
Team India
Follow us on

IND vs ENG 2nd Test: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌ 10 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి.. భారత్‌పై 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రూట్ 180* పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. బెయిర్ స్టో 57, బర్న్స్ 49 చొప్పున అత్యధిక పరుగులు చేశారు. ఇక భారత్ బౌలర్లు సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 3, షమి 2 వికెట్లు తీసుకున్నారు.

కాగా, లార్డ్స్‌ వేదికగా జరుగుతోన్న రెండవ టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శి్స్తూ వచ్చింది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన భారత్, ఇటు బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్‌) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. మిగతా ప్లేయర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే జడేజా, పంత్ మాత్రం ఆకట్టుకోవడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ చేసింది. 86 పరుగుల వ్యవధిలో టీమిండియా.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. కాగా, ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 5 వికెట్లు తీయగా, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌ తలో 2 వికెట్లు, మొయిన్‌ అలీ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే తడబడింది. సిరాజ్ దెబ్బకు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను సిరాజ్‌(2/34) దారుణంగా దెబ్బతీశాడు. అయితే.. బర్న్స్‌49 పరుగులు, రూట్‌ 48 నాటౌట్‌తో ఆదుకున్నారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. మూడవ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ టీమ్.. నిలకడగా రాణిస్తూ జట్టు స్కోర్‌ను అమాంతం పెంచేసింది. మూడవ రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ టీమ్.. 391 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ కెప్టెన్ రూట్ 180* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టీమ్ భారత్‌పై 27 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Tweet:

Also read:

Hyderabad City: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అక్కాచెల్లెళ్లు మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి.. మీర్‌పేట కార్పొరేటర్ ముద్ద పవన్ అరెస్ట్

Skin Peeling: అరచేతులు.. అరికాళ్ళ చర్మం పొట్టులుగా ఎందుకు రాలుతుంది? దీనిని నివారించడం ఎలా?