బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఫైనల్ ఎలెవన్ నుంచి తొలగించి అతని స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌కు చోటు కల్పించారు. ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ఉనాద్కత్ సుమారు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడీ లెఫ్టార్మ్ పేసర్. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి వికెట్ పడగొట్టి భారత జట్టుకు శుభారంభం అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను విడగొట్టి ఘనంగా పునరాగమనం చేశాడు. జయదేవ్ సుమారు 12 ఏళ్ల క్రితం (16 డిసెంబర్ 2010)న తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీమిండియాలో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌ద్వారా కెరీర్‌లో తొలి టెస్టు వికెట్ కూడా అందుకున్నాడు ఉనద్కత్.
కాగా జయదేవ్ ఉనద్కత్ తన రెండవ టెస్ట్ ఆడేందుకు సుమారు 4389 రోజుల పాటు అలాగే 118 టెస్టుల వేచి చూడాల్సి వచ్చింది. గతంలో జయదేవ్ కంటే ముందు దినేష్ కార్తీక్ 87 టెస్టు మ్యాచ్‌లు వేచి చూశాడు. కాగా 2010లో ఉండకత్ తన మొదటి టెస్టు ఆడినప్పుడు, విరాట్ కోహ్లీ ఇంకా తన టెస్టు అరంగేట్రం చేయలేదు. అదే సమయంలో, ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అప్పటి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండడం గమనార్హం. కాగా టీమిండియాలో చోటు దక్కకున్న రంజీ ట్రోఫీతో పాటు దేశవాళి టోర్నీల్లో స్థిరంగా రాణిస్తున్నాడు జయదేవ్. ఇప్పటివరకు 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ సీమర్ 353 వికెట్లు తీశాడు. అంతేగాక అతని ఖాతాలో ఏడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ అదరగొట్టాడు. మొత్తం 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక భారత్ తరఫున ఉనద్కత్ ఏడు వన్డేలు, 10 టీ20లు ఆడాడు జయదేవ్.
Maiden Test wicket for @JUnadkat ??
He has had to wait for 12 years but the moment has arrived as the speedster picks up his first Test wicket.
Zakir Hasan departs for 15 runs.
Live – https://t.co/XZOGpedaAL #BANvIND pic.twitter.com/2nXLkOfniv
— BCCI (@BCCI) December 22, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..