IND vs AUS 2nd Test: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్పిన్‌ను చితక్కొట్టే మొనగాడు వచ్చేశాడు.. మరోసారి ఆసీస్‌కు షాకే..

|

Feb 15, 2023 | 12:30 PM

India vs Australia 2nd Test: ఢిల్లీలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తిరిగి రానున్నాడు. గాయం నుంచి కోలుకుని, నంబర్ 5లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

IND vs AUS 2nd Test: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్పిన్‌ను చితక్కొట్టే మొనగాడు వచ్చేశాడు.. మరోసారి ఆసీస్‌కు షాకే..
Ind Vs Aus
Follow us on

Border Gavaskar Trophy 2023: భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరిగింది. ఇందులో భారత జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇప్పుడు ఈ రెండు జట్లు రెండో టెస్టు మ్యాచ్ కోసం ఢిల్లీలో తలపడనున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఢిల్లీ టెస్టు మ్యాచ్‌కి ముందు భారత జట్టుకు శుభవార్త వచ్చింది. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు భారత జట్టులో చేరబోతున్నాడు. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయాస్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు.

జట్టులోకి వచ్చిన శ్రేయాస్..

శ్రేయాస్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, బీసీసీఐ వైద్య బృందం అతడిని ఆడేందుకు అనుమతినిచ్చిందని బీసీసీఐ ధృవీకరించింది. శ్రేయాస్ ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టులో భాగం కానున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుత ఫామ్‌..

గాయానికి ముందు టెస్టు క్రికెట్‌లో శ్రేయాస్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతోంది. గతేడాది భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో చాలా పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్?

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ నంబర్-5లో బ్యాటింగ్ చేశాడు. ఈ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ సాధారణంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. శ్రేయాస్ స్పిన్ బౌలింగ్‌ను చక్కగా ఆడేస్తాడు. నిరంతరం పరుగులు సాధిస్తున్నాడు. భారత పరిస్థితుల్లో స్పిన్‌పై శ్రేయాస్‌ రికార్డు కూడా చాలా బాగుంది. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన స్పిన్ బౌలర్ టాడ్ మర్ఫీ.. తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్లు తీసి భారత్ మిడిల్ ఆర్డర్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. మరోవైపు నాథన్ లియాన్ బౌలింగ్‌ను హ్యాండిల్ చేయడం కూడా భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టమైన పని కాదు. కాబట్టి, రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్పిన్ బౌలర్లిద్దరికీ శ్రేయాస్ గట్టిగా సమాధానం చెప్పగలడు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..