IND vs AUS: సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా హిట్‌మ్యాన్.. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాలే..

ICC World Cup: రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఇప్పుడు తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించే అవకాశం వచ్చింది. నేటి మ్యాచ్‌లో ఇది సాధ్యమైతే భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెర తీసిన వాడవుతాడు.

IND vs AUS: సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా హిట్‌మ్యాన్.. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాలే..
Rohit Shamra Records

Updated on: Nov 19, 2023 | 11:39 AM

Rohit Sharma Record: ప్రపంచ కప్ 2023 చివరి మ్యాచ్ నవంబర్ 19న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా చేయలేని రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట లిఖించే అవకాశం ఉంది. ఈ ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే, ఆ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.

ఫైనల్‌లో సెంచరీ సాధించి రికార్డ్?

ఇప్పటి వరకు ప్రపంచకప్ చరిత్రలో ఏ భారత బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయలేదు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 10 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 550 పరుగులు చేశాడు. ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

IND vs AUS: భారత్  వర్సెస్ ఆస్ట్రేలియా లైవ్ బ్లాగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అతని కెప్టెన్సీలో భారత్ 2023 ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.

కెప్టెన్‌గా ధోనీ భారీ ఇన్నింగ్స్‌..

భారత కెప్టెన్‌గా ప్రపంచకప్‌ ఫైనల్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్‌ ఆడిన ఆటగాడిగా మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డు సృష్టించాడు. అతను 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో అజేయంగా 91 పరుగులు చేశాడు. 2011లో సిక్సర్ కొట్టి టీమ్ ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ కూడా అద్భుత ప్రదర్శన చేసి 97 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ ప్రపంచకప్‌లో అదిరిపోయే ఫామ్‌తో దూసుకెళ్తోన్న రోహిత్ శర్మ..

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గణాంకాలను పరిశీలిస్తే పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి అభిమానుల చూపు రోహిత్ శర్మపైనే ఉంది. ప్రధానమంత్రి మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు అహ్మదాబాద్‌లోని క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..