Ashwin: కుంబ్లే, మురళీధరన్‌ను వెనక్కినెట్టిన అశ్విన్.. దెబ్బకు 18 ఏళ్ల రికార్డు బ్రేక్..

|

Feb 10, 2023 | 6:03 AM

IND Vs AUS: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అశ్విన్ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలెక్స్ క్యారీ వికెట్‌తో..

Ashwin: కుంబ్లే, మురళీధరన్‌ను వెనక్కినెట్టిన అశ్విన్.. దెబ్బకు 18 ఏళ్ల రికార్డు బ్రేక్..
Ravichandran Ashwin
Follow us on

నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అశ్విన్ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలెక్స్ క్యారీ వికెట్‌తో దిగ్గజాలు కుంబ్లే, మురళీధరన్‌ను వెనక్కినెట్టిన అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. తద్వారా 18 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

అలెక్స్ క్యారీ వికెట్‌తో అశ్విన్ టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అతడు ఈ ఘనతను కేవలం 89 టెస్టుల్లోనే అందుకున్నాడు. తద్వారా 18 ఏళ్ల క్రితం అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. మార్చి 2005లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే 450 వికెట్లను పూర్తి చేశాడు. ఈ ఘనత 93 మ్యాచ్‌లు సాధించిన విషయం విదితమే.

మరోవైపు అత్యంత వేగంగా 450 టెస్టు వికెట్లు తీసిన భారత ఆటగాడిగా అవతరించడంతో పాటు, ఈ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు 80 టెస్టుల్లోనే 450 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.