ఆసీస్ టూర్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన షాకింగ్ కామెంట్స్ హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో, సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఏకంగా రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ టీమిండియాలో ఏం చేసారో వివరిస్తూ ఫ్యాన్స్ మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. 2021 నుంచి టెస్టుల్లో అధిక రన్స్ చేసింది రోహిత్ శర్మ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత అవమానకరంగా రోహిత్‌ను తప్పిస్తారా అంటూ నిలదీస్తున్నారు. గంభీర్ బాధ్యతలు తీసుకున్నాకే టీమ్ ఇండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ టార్గెట్ చేస్తున్నారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 5వ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్‌ను కాదని.. బుమ్రాకు బాధ్యతలు ఇచ్చారు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు. గంభీర్ వచ్చాకే టీమ్ ఇండియాకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని.. తప్పించాల్సింది గంభీర్‌ను అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
This was the moment when the insecurity of Gautam Gambhir and Kohli started.
RIP GAUTAM GAMBHIR pic.twitter.com/UBm0TZJkgy
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) January 2, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి