Nitish Kumar Reddy Net Worth: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి తన తొలి సెంచరీని నమోదు చేశాడు. భారత జట్టు కష్ట సమయంలో 8వ బ్యాట్స్‌మెన్‌గా రంగంలోకి దిగిన నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా బ్యాటింగ్ చేసి సెంచరీ నమోదు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ తర్వాత ఆయనపై కాసుల వర్షం కురుస్తోంది. సమాచారం మేరకు నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి నితీష్ 105 పరుగులతో అజేయంగా నిలిచిన అనంతరం ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రాకు చెందిన కుర్రాడు టీ20, టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక కావడం గొప్ప విషయం. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డికి ప్రైజ్ మనీగా రూ.25 లక్షలు ఇవ్వనుంది అంటూ ప్రకటించాడు.
MSK Prasad Yesterday : “ NITISH KUMAR REDDY Creating confusion in team he is not complete Batter or Bowler, he can’t win matches with his Skills”
Today Nitish created History with his maiden Century, Perfect way to shut mouth of Critics 🤫#INDvsAUS
— Veena Jain (@DrJain21) December 28, 2024
ఈ సెంచరీకి సంబంధించిన ప్రైజ్ మనీ నితీష్ కుమార్ రెడ్డికి దక్కనుంది. NDTV వార్తల ప్రకారం, నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 25 లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తుందని తెలిసినప్పటికీ, నితీష్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి రివార్డ్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.
వార్తల ప్రకారం సెంచరీ చేసిన నితీష్ రెడ్డికి బీసీసీఐ రూ.5 లక్షలు చెల్లించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ డబ్బు నితీష్ కుమార్ రెడ్డికి మ్యాచ్ ఫీజు నుంచి విడిగా అందుబాటులో ఉంటుంది. టెస్టుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లకు బీసీసీఐ రూ.5 లక్షలు, డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లకు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..