Travis Head: 100 టూ 1000.. కట్‌చేస్తే.. రికార్డులతో టీమిండియా బెండ్ తీసిన ట్రావిస్ హెడ్.. అవేంటంటే?

|

Dec 15, 2024 | 11:26 AM

Travis Head Century: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిస్ హెడ్ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. అడిలైడ్ తర్వాత గబ్బాలోనూ అద్భుత సెంచరీతో టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌తో అతను టెస్టు క్రికెట్‌లో భారత్‌పై 1000 పరుగులు పూర్తి చేసి, మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

1 / 5
Travis Head Century: గబ్బాలో చివరి మూడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో జీరోకే ఔట్ అయిన ట్రావిస్ హెడ్, భారత్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అతను మొదట మూడు వరుస ఇన్నింగ్స్‌లలో ఓ చెత్త ప్రదర్శనకు చెక్ పెట్టేశాడు. కేవలం 115 బంతుల్లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లో టీమిండియాపై మరో ఘనత సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మ్యాచ్‌లో హెడ్ మరోసారి క్రికెట్ రికార్డులను తిరగేస్తూ టీమ్ ఇండియాతో జరిగిన టెస్టులో 1000 పరుగులు పూర్తి చేశాడు.

2 / 5
ట్రావిస్ హెడ్ గబ్బా టెస్టులో టీమిండియాపై టెస్టు క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు సృష్టించాడు. విశేషమేమిటంటే టెస్టు క్రికెట్‌లో ఏ జట్టుపైనా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌పై అతని బ్యాట్ భీకరంగా పరుగుల వర్షం కురిపిండం గమనార్హం. ఇంతకు ముందు కూడా, అతను చాలా ముఖ్యమైన సందర్భాలలో టీమ్ ఇండియాకు లోతైన గాయాలను మిగిల్చాడు.

3 / 5
భారత్‌తో జరిగిన చివరి 7 టెస్టు ఇన్నింగ్స్‌లలో మూడింటిలో ట్రావిస్ హెడ్ సెంచరీలు సాధించాడం గమనార్హం. గబ్బా టెస్టులో సెంచరీకి ముందు, అతను టెస్టులో భారత్‌పై 90(163), 163(174), 18(27), 11(13), 89(101), 140(141) పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 141 బంతుల్లో 140 పరుగులు చేశాడు.

4 / 5
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో ట్రావిస్ హెడ్ వరుసగా మూడు సార్లు జీరోకే ఔట్ అయినప్పటికీ, అతను ఈ మైదానంలో టెస్టుల్లో తన రెండో సెంచరీని సాధించాడు. అంతకుముందు, అతను 2021లో గబ్బాలో ఇంగ్లండ్‌పై టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కేవలం 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 148 బంతుల్లో అతని బ్యాటింగ్‌లో 152 పరుగులు వచ్చాయి.

5 / 5
దీంతో పాటు భారత్‌తో జరిగిన టెస్టులో ట్రావిస్ హెడ్ తన మూడో సెంచరీని కూడా పూర్తి చేశాడు. అంతకుముందు అడిలైడ్‌లో 140 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, 2023 WTC ఫైనల్‌లో టీమిండియాపై 174 బంతుల్లో 163 ​​పరుగులు చేశాడు.