Virat Kohli India vs Australia Hyderabad: భారత్ – ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. సిరీస్‌లో ఇరు జట్లు సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమితో.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్ రేసులో నిలిచింది. అయితే, రెండో మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. అతన్ని ఆడమ్ జంపా అవుట్ చేశాడు. ఇక తాజాగా జరగనున్న మూడో టీ20లోనూ కోహ్లీకి జంపా ప్రమాదకరమని నిరూపించవచ్చని తెలుస్తోంది.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఇరు జట్లకు 8 ఓవర్ల చొప్పున కేటాయించారు. ఆస్ట్రేలియా 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో భారత్ 7.2 ఓవర్లలోనే విజయం సాధించింది. కోహ్లి 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. 6 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేశాడు. ఆ తర్వాత జంపా విరాట్ కోహ్లీ పాటిల యముడిలా మారాడు. జంపా ఐదో ఓవర్లో రెండో బంతిని అర్థం చేసుకోలేక కోహ్లి బౌల్డ్ అయ్యాడు.
జంపా ఇప్పటి వరకు కోహ్లీకి ప్రమాదకరమని తేలింది. గత 23 మ్యాచ్‌ల్లో 8 సార్లు కోహ్లీని బలిపశువుగా మార్చేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లోనూ కోహ్లీ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. స్పిన్ బౌలర్ జంపా కోహ్లీని సులభంగా తన వలలో పడేసుకుంటున్నాడు. మొహాలీ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా కోహ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. 7 బంతుల్లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడిని నాథన్ ఎల్లిస్ పెవిలియన్ పంపాడు. ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. విరాట్ అభిమానులు అతని నుంచి మంచి ప్రదర్శనను కోరుకుంటున్నారు.
అయితే, మాజీ సారథికి బాగా కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం కూడా ఒకటిగా నిలిచింది. ఇక్కడ కోహ్లి 3 ఫార్మాట్‌లలో కలిపి 8 మ్యాచ్‌లు అంటే 3 టెస్టులు, 4 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 607 పరుగులు సాధించాడు. ఇక చివరిసారి అంటే 2019లో వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో విరాట్ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక టీమిండియా ప్రస్తుత సారథి హిట్‌మ్యాన్‌కు మాత్రం ఉప్పల్ స్టేడియం అంతగా కలిసిరాలేదు. రోహిత్ శర్మ ఇక్కడ 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 46 రన్స్ చేశాడు. ఏదేమైనా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని ఇరుజట్లు ఆరాటపడుతున్నాయి.