IND Vs AUS: ఫర్వాలేదనిపించిన ఆసీస్.. బెంబేలెత్తించిన టీమిండియా బౌలర్లు.. స్కోర్ వివరాలు ఇవిగో!
ఢిల్లీలో టీమిండియాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఫర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో..
ఢిల్లీలో టీమిండియాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఫర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(81), హ్యాండ్స్‌కంబ్(72) అర్ధ సెంచరీలతో అదరగొట్టగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(33) ఫర్వాలేదనిపించాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 4 వికెట్లతో ఆసీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు.. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్(15), ఖవాజా(81) మొదటి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వార్నర్(15), లబూషేన్(18), స్టీవ్ స్మిత్(0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. ఒక ఎండ్‌లో ఖవాజా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసే దిశగా అడుగులు వేస్తున్న అతడ్ని.. రాహుల్ అద్భుత క్యాచ్ పట్టుకుని పెవిలియన్ పంపించాడు. అయితేనేం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యాండ్స్‌కంబ్(72) చివరి వరకు అజేయంగా నిలిచి.. ఆసీస్ స్కోర్ 250 దాటడంలో కీలక పాత్ర పోషించాడు.
2ND Test. WICKET! 78.4: Matthew Kuhnemann 6(12) b Mohammad Shami, Australia 263 all out https://t.co/hQpFkyZGW8 #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) February 17, 2023