
IND vs AUS 1st T20I Playing 11: ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు అన్ని జట్ల దృష్టి టీ20పైనే ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాపై టీ20లో వరుసగా మూడో విజయం సాధించినట్లవుతుంది. ఆతిథ్య జట్టు ఈ సిరీస్‌ను గెలిస్తే కంగారూ జట్టుపై వరుసగా మూడో సిరీస్ విజయం సాధించినట్లవుతుంది. 2020, 2022లో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకుంది.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..