ICC Rankings: 11 మ్యాచ్‌లు ఆడాడు.. 10 ఇన్నింగ్స్‌లో విఫలం.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి గుడ్‌న్యూస్ అందుకున్న భారత ఫ్యూచర్ స్టార్..

|

Aug 09, 2023 | 7:23 PM

Shubman Gill - Tilak Varma: ఐపీఎల్‌ నుంచి అతను గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. IPL తర్వాత, అతను టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌తో సహా మొత్తం 11 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 11 ఇన్నింగ్స్‌లో అతను కేవలం ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే యాభై పరుగులు చేయగలిగాడు. 10 ఇన్నింగ్స్‌లలో విఫలమైనప్పటికీ, అతను ప్రస్తుతం ఓ గుడ్ న్యూస్ అందుకున్నాడు. మరోవైపు గత 6 రోజులుగా క్రికెట్ ప్రపంచంలో తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆగస్ట్ 3న టీమ్ ఇండియా తరపున తిలక్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

ICC Rankings: 11 మ్యాచ్‌లు ఆడాడు.. 10 ఇన్నింగ్స్‌లో విఫలం.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి గుడ్‌న్యూస్ అందుకున్న భారత ఫ్యూచర్ స్టార్..
Team India
Follow us on

గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా శుభ్‌మన్ గిల్ బ్యాట్ నిశ్శబ్దంగా ఉంది. వెస్టిండీస్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో తొలి 3 మ్యాచ్‌ల్లో అతను 7 పరుగులకు పైగా చేరుకోలేకపోయాడు. అంతే కాదు వన్డే సిరీస్‌లోనూ ఒకే ఒక్క మ్యాచ్‌లో పరుగులు చేయగలిగాడు. ఐపీఎల్‌ నుంచి అతను గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. IPL తర్వాత, అతను టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌తో సహా మొత్తం 11 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 11 ఇన్నింగ్స్‌లో అతను కేవలం ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే యాభై పరుగులు చేయగలిగాడు. 10 ఇన్నింగ్స్‌లలో విఫలమైనప్పటికీ, అతను ప్రస్తుతం ఓ గుడ్ న్యూస్ అందుకున్నాడు.

తాజాగా బుధవారం విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్స్‌కు చేరుకున్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ 9 స్థానాలు ఎగబాకి 36వ స్థానానికి చేరుకున్నాడు. గిల్ గురించి మాట్లాడితే, వెస్టిండీస్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో అతని బ్యాట్‌లో చివరి ఇన్నింగ్స్‌లో యాభై పరుగులు వచ్చాయి. అతను 85 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

తిలక్ వర్మ ఆధిపత్యం..

గత 6 రోజులుగా క్రికెట్ ప్రపంచంలో తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆగస్ట్ 3న టీమ్ ఇండియా తరపున తిలక్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతను 6 రోజుల్లో 3 మ్యాచ్‌లు ఆడాడు. 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించాడు.

ఐసీసీ ర్యాకింగ్స్‌లో తిలక్ ఎంట్రీ..

తన కెరీర్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో తిలక్ బ్యాట్ రాణించడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రివార్డు లభించింది. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిలక్ 46వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో ఇప్పటివరకు జరిగిన 5 టీ20ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో 39, రెండో మ్యాచ్‌లో 51, మూడో మ్యాచ్‌లో 49 నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..