Dinesh Karthik: సత్తా చాటిన దినేశ్ కార్తీక్.. 108 స్థానాలు ఎగబాకిన డీకే.. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే
సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ లో చెలరేగి, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్(Dinesh Karthik) తన బ్యాంటింగ్ తో అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత టీమ్ ఇండియాకు ఎంపికై సరికొత్త కార్తీక్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఈ...
సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ లో చెలరేగి, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్(Dinesh Karthik) తన బ్యాంటింగ్ తో అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత టీమ్ ఇండియాకు ఎంపికై సరికొత్త కార్తీక్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో(India-Soth Africa) జరిగిన టీ20 సిరీస్‌లో చెలరేగి ఆడి, సత్తా చాటాడు. ఈ దూకుడైన ప్రదర్శనలతో ఐసీసీ టీ20(ICC T-20) ర్యాంకింగ్స్‌లో దినేశ్ కార్తీక్ ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87 స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. ఇదే సిరీస్ లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన ఇషాన్ కిషన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 6వ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో యుజువేంద్ర చాహల్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో ఉండగా.. ఆసీస్ ఫాస్ట్‌బౌలర్ జోస్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Players are jostling for spots in the latest @MRFWorldwide T20I men’s player rankings ?
కాగా.. దినేశ్ కార్తీక్ 15 ఏళ్ల తర్వాత ఈ టీ-20 ఫార్మాట్ లో తొలి అంతర్జాతీయ అర్ధ సెంచరీ అందుకోవడం విశేషం. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో కార్తీక్ ఆడింది కేవలం 36 టీ20లే. అయితే అప్పుడప్పుడూ వచ్చిన అవకాశాలను కార్తీక్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల వయసులో అతను తిరిగి టీమ్‌ఇండియాలోకి రావడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తనలోని కొత్త ఆటగాడిని ఆవిష్కరించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఫినిషర్ గా అదరగొట్టాడు. ఐపీఎల్ లో 183.33 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టులో చోటు కల్పించక తప్పలేదు.