Scott Styris: అతడికి పది కోట్లు చెల్లిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు.. కివీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

Scott Styris: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ను ఏ ఫ్రాంఛైజీ అయినా రూ.10 కోట్లు వెచ్చించి తీసుకుంటే అది తెలివి తక్కువ పనే అవుతుందని

Scott Styris: అతడికి పది కోట్లు చెల్లిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు.. కివీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

Updated on: Jan 27, 2021 | 5:22 AM

Scott Styris: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ను ఏ ఫ్రాంఛైజీ అయినా రూ.10 కోట్లు వెచ్చించి తీసుకుంటే అది తెలివి తక్కువ పనే అవుతుందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ స్కాట్ స్టైరిస్‌ అన్నాడు. తన ఉద్దేశం మాక్సీకి ప్రతిభ లేదని కాదని, కానీ లీగ్‌లో గత అయిదారేళ్లగా అతడు పూర్తిగా విఫలమవుతున్నాడని ఆరోపించాడు.

2020 ఐపీఎల్ వేలంలో మాక్స్‌వెల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గత సీజన్‌లో అతడు పేలవమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అతడు మంచి ఆటగాడని అందరికీ తెలుసు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ తన సామర్థ్యాన్ని మాక్సీ చాటిచెప్పలేకపోతున్నాడు. అయితే మాక్స్‌వెల్‌ను తీసుకోవాలంటే కనీస ధరను వెచ్చించి తీసుకోవాలి. అప్పుడు అతడు సత్తాచాటితే ఆ ఫ్రాంఛైజీకీ అదృష్టమే. అయిదు-ఆరు సీజన్ల నుంచి ఉత్తమ ప్రదర్శన చేయట్లేదు. కానీ ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అతడు వచ్చే సీజన్‌లో కసితో ఆడే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు స్కాట్ స్టైరిస్‌.

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. నాడు ఎస్పీ పేరిట ఫేక్ ఫేస్‌బుక్.. నేడు ఏకంగా కలెక్టర్‌ను టార్గెట్ చేసుకుని..