Iceland Cricket: రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంకలో పుడితే.. బ్రాడ్‌మాన్‌ ఐస్‌లాండ్‌లో జన్మిస్తే.. ఎలా ఉంటుదంటే..

|

Dec 28, 2021 | 4:13 PM

దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలపై టీమ్ ఇండియా స్పిన్ ఏస్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించిన కొద్ది రోజుల తర్వాత, ఐస్లాండ్ క్రికెట్ వీరిద్దరి గురించి ట్విట్టర్‌లో చమత్కారమైన ట్వీట్‌ను పంచుకుంది...

Iceland Cricket: రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంకలో పుడితే.. బ్రాడ్‌మాన్‌ ఐస్‌లాండ్‌లో జన్మిస్తే.. ఎలా ఉంటుదంటే..
Ashwin
Follow us on

దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలపై టీమ్ ఇండియా స్పిన్ ఏస్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించిన కొద్ది రోజుల తర్వాత, ఐస్లాండ్ క్రికెట్ వీరిద్దరి గురించి ట్విట్టర్‌లో చమత్కారమైన ట్వీట్‌ను పంచుకుంది. అశ్విన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ వంటి ఆటగాళ్లు జనాదరణ లేని క్రికెట్ దేశంలో జన్మించి ఉంటే, వారు ఈ రోజు ఉన్న మైలురాళ్లను సాధించి ఉండకపోవచ్చని క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ఉదాహరణకు, అశ్విన్ శ్రీలంకలో జన్మించినట్లయితే, అతను లెజెండరీ మురళీధరన్ వలె ఎక్కువ వికెట్లు తీసి ఉండవచ్చు. అదేవిధంగా బ్రాడ్‌మాన్‌ ఐస్‌లాండ్‌లో జన్మించినట్లయితే, లెజెండరీ బ్యాటర్ అంతర్జాతీయంగా ఎక్కువ పరుగులు చేసి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించింది.

“ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంకలో పుట్టి ఉంటే, అతను బహుశా మురళీధరన్ లాగా ఎక్కువ వికెట్లతో తన కెరీర్‌ను ముగించేవాడు. ” అని క్రికెట్ ఐస్‌లాండ్ శనివారం ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. “అశ్విన్ ఇంగ్లాండ్‌లో పుడితే, అతను 80mph స్వింగ్ బౌలర్ అయ్యేవాడు” అని ఒక నెటిజన్ రాశారు. మరొకరు “దక్షిణాఫ్రికా గ్రేట్ AB డివిలియర్స్ భారతదేశంలో జన్మించినట్లయితే అతను ఇతర క్రికెట్ ఆటగాళ్ల కంటే ఎక్కువ హైప్ పొందేవాడని”, “విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాలో జన్మించినట్లయితే, అతను బహుశా క్లబ్ క్రికెటర్ కావచ్చు” ఇలా డిఫరెంట్‌‎గా రాసుకొచ్చారు.

కోహ్లీకి మద్దతుగా మరొక అభిమాని “కోహ్లి న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్‌లో జన్మించినట్లయితే, అతను ఇప్పటికీ కెప్టెన్‌గా కొనసాగేవాడు” అని రాశాడు. 800 టెస్టు వికెట్ల రికార్డును ప్రస్తుత బౌలర్లలో అశ్విన్ మాత్రమే బద్దలు కొట్టగలడని మురళీ సూచించాడు. ఆసక్తికరంగా, 81 టెస్టు మ్యాచ్‌ల్లో 427 వికెట్లు పడగొట్టిన అశ్విన్, మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టాలంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంది.

Read Also.. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల వీరవిహారం.. 8 ఫోర్లు, 13 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టారు.. ఎవరో తెలుసా?