World Cup 2023: భారత్‌కు కలిసొచ్చిన బుధవారం.. రోహిత్ సేన కప్పుకొట్టడం పక్కా అంటోన్న ఫ్యాన్స్‌.. రీజన్‌ ఇదిగో

బుధవారం (నవంబర్ 15) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు అంచనా వేశారు. ఇది కూడా నిజమైంది. ముంబైలో కివీస్‌ను చిత్తు చేసి ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది రోహిత్‌ సేన. కాగా వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. అయితే ఇప్పటివరకు భారత జట్టు రెండుసార్లు మాత్రమే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే

World Cup 2023: భారత్‌కు కలిసొచ్చిన బుధవారం.. రోహిత్ సేన కప్పుకొట్టడం పక్కా అంటోన్న ఫ్యాన్స్‌.. రీజన్‌ ఇదిగో
Team India

Updated on: Nov 17, 2023 | 11:18 AM

సుమారు పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోతోన్న టీమ్ ఇండియా.. ఈ ప్రపంచకప్‌తో నైనా ఆ కరువుకు స్వస్తి పలకాలని పట్టుదలగా ఉంది. ఆతిథ్య దేశంగా ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే టోర్నీలోని అన్ని బలమైన జట్లను ఏకపక్షంగా ఓడించింది. అందుకే ఈసారి భారత్ ప్రపంచ ఛాంపియన్ అని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక బుధవారం (నవంబర్ 15) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు అంచనా వేశారు. ఇది కూడా నిజమైంది. ముంబైలో కివీస్‌ను చిత్తు చేసి ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది రోహిత్‌ సేన. కాగా వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. అయితే ఇప్పటివరకు భారత జట్టు రెండుసార్లు మాత్రమే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. వరల్డ్‌ కప్‌ గెల్చిన రెండు సందర్భాల్లోనూ భారత్ తన సెమీఫైనల్‌ మ్యాచ్‌ను బుధవారమే ఆడింది. ఈసారి కూడా బుధవారమే జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాదృచ్ఛికం నిజమైతే టీమ్ ఇండియా 2023 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్‌.

1983 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా జూన్ 22 సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 213 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

1983 ప్రపంచ కప్ సెమీ ఫైనల్

ఇక స్వదేశంలో జరిగిన 2011 ప్రపంచ కప్‌ విషయానికొస్తే.. మార్చి 30న పాకిస్తాన్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడింది టీమిండియా. యాదృచ్ఛికంగా ఆరోజు కూడా బుధవారమే. ఎప్పటిలాగే పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఆతర్వాత పాకిస్థాన్ ను 231 పరుగులకు కుప్పకూల్చింది. ఇక ఫైనల్‌లో లంకను చిత్తు చేసి విశ్వ విజేతగా ఆవిర్భవించింది.

2011 ప్రపంచ కప్ సెమీస్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి